Monday, May 6, 2024

ప్రెగ్నెంట్ అవ్వాలి నాభర్తని పంపించండి అని కోర్టుకెక్కిన మహిళ

ఉత్తరాఖండ్‌ హైకోర్టుకు పెద్ద సమస్యే వచ్చి పడింది. జైలులో ఉన్న తన భర్తను కొన్ని రోజుల పాటు విడుదల చేయాలని…తద్వారా ఆ సమయంలో తాను గర్భం దాల్చే అవకాశముందని హై కోర్టు పటిషన్ దాఖలు చేసింది. షాకింగా ఉంది కదా..అవును మీరు చదువుతున్నది నిజమే.. తాను తల్లిని కావాలి అనుకుంటున్నాను అని తన భార్తను నా దగ్గరకి పంపించమని ఆ యువతి ఏకంగా రాష్ట్ర హైకోర్టునే ఆశ్రయించింది.

దీంతో పూర్తి వివరాల్లోకి వెళ్లితే..ఉత్తరాఖండ్‌కు చెందిన సచిన్ అనే యువకుడు తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఓ మైనర్ బాలికపై దారుణంగా గ్యాంగ్‌ రేప్‌కు పాల్పడ్డాడు. దీంతో ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. నేరం రుజువు కావడంతో సచిన్‌తో పాటు మిగిలిన దోషులకు.. ఏకంగా 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఇంత వరకు బాగనే ఉంది.. నేరం చేసాడు .. చట్ట, తన పని తాను చేసుకుపోయింది.. అయితే ఇక్కడే కధ కొత్త అడ్డం తిరిగింది. ఎవరు ఊహించని పాయింట్ తో సీన్ లోకి ఎంటర్ అయ్యింది..నిందితుడి భార్య. అసలు ఆమె పాయింట్ ఏంటో తెలుసా.. ఏం డిమాండ్ చేసిందో తెలిస్తే షాక్ అయ్యిపోతారు.

తన భర్త ద్వార తనకు గర్భవతిని కావాలని దానికి అతనిని కొన్ని రోజులు విడుదల చేయాలని ఆమే పిటిషన్ లో కోరింది. అయితే తనకు మాతృత్వంలోని మాధుర్యం తెలుసుకోవాలని ఉందని, ఇది భార్యగా తన హక్కు అని ..తన భర్తకు షార్ట్ టర్మ్ బెయిల్ ఇవ్వాలంటూ అతడి భార్య హైకోర్టును ఆశ్రయించడం హాట్‌టాపిక్‌గా మారింది. తన భర్తకు కొంతకాలం బెయిల్ ఇస్తే తాను గర్భం దాల్చేందుకు అవకాశం ఉంటుందని తన పిటిషన్‌లో పేర్కొంది.. అయితే ఎన్నడూ ఊహించని ఇలాంటి పిటిషన్‌తో ఉత్తరాఖండ్ హైకోర్టు షా అయ్యింది.


ఈ పిటిషన్‌ తో ధర్మాసనం కి లేనిపోని కొత్త డౌట్లు వచ్చాయి. ఎన్నో అనుమానాలను కూడా లేవనేత్తింది. అసలు ఇలాంటి పరిస్ధితి.. ఇంతక ముందు ఎప్పుడైనా తల్లెత్తిందా అని పాత కేసులను ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ క్రమంలో తమకు సలహా ఇవ్వాలని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తమకు సరిగా తెలియడం లేదని ధర్మాసనం పేర్కొంది. గతంలో ఇలాంటి కేసులేమైనా అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, కెనడా వంటి దేశాల్లో నమోదయ్యాయా.. ఒకవేళ నమోదైతే అక్కడి కోర్టులు ఎలాంటి తీర్పులిచ్చాయి.. అన్ని వివరాలతో తమకు నివేదిక సమర్పించాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది…!!

ఇది కూడా చదవండి: బిగ్ బాస్-5: షణ్ముఖ్ జశ్వంత్ పారితోషికం ఎంతో తెలుసా?

Advertisement

తాజా వార్తలు

Advertisement