Thursday, April 25, 2024

సూపర్ స్టార్ నయా లుక్… సోషల్ మీడియాలో వైరల్

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి సినీ అభిమానులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. ముఖ్యంగా మహేష్ కు లేడీస్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. నాలుగు పదుల వయసు మీదపడుతున్నా… మహేష్ ఎప్పుడూ 25 ఏళ్ల కుర్రాడిగానే కనిపిస్తారు. అయితే తాజాగా మహేష్ కు సంబంధించిన లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అందులో మహేష్ లాంగ్ హెయిర్ తో గడ్డం ట్రిమ్ చేసుకొని స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. బ్యాంకింగ్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement