Thursday, May 2, 2024

బిగ్ బాస్-5: షణ్ముఖ్ జశ్వంత్ పారితోషికం ఎంతో తెలుసా?

అతి త్వరలోనే బిగ్ బాస్ ఐదో సీజన్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు అధికారికంగా ఈ షోలో పాల్గొనేవారి పేర్లు బయటకు రాకున్నా సోషల్ మీడియాలో మాత్రం కంటెస్టెంట్లు వీరే అంటూ కొన్నివార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ జాబితాలో ప్రముఖంగా వినపడుతున్న పేరు షణ్ముఖ్ జశ్వంత్. యూట్యూబ్ వీడియోలతో యూత్‌లో తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్న అతడు బిగ్‌బాస్-5లో కనపడటం లాంఛనమే. గతంలోనే అతడికి బిగ్‌బాస్ ఆఫర్లు వచ్చినా తిరస్కరించినట్లు సమాచారం. అయితే ఈ సీజన్‌కు మాత్రం అతడు రావడం పక్కా అని తేలిపోయింది.

ఈ నేపథ్యంలో అతడికి బిగ్‌బాస్ ఆఫర్ చేసిన రెమ్యునరేషన్ వింటే ఆశ్చర్యం కలగక మానదు. ఈ షో కోసం రూ.కోటి వరకు పారితోషికాన్ని ఇవ్వడానికి మేకర్స్‌ అంగీకరించారట. ప్ర‌స్తుతం ఈ విష‌యం ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కాగా బిగ్‌బాస్-5లో పాల్గొనేవారిలో షణ్ముఖ్ జశ్వంత్‌తో పాటు హీరోయిన్‌ ఈషా చావ్లా, జబర్దస్త్‌ ప్రియాంక, ఆనీ మాస్టర్‌, కార్తీక దీపం ఫేమ్‌ ఉమా దేవి, బుల్లితెర నటుడు సన్నీ, మోడల్‌ జస్వంత్‌, పూనం భాజ్వా, యాంకర్‌ శివ, లోబో, యాంకర్‌ ప్రత్యూష పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

ఈ వార్త కూడా చదవండి: చిరంజీవికి చెల్లెలుగా హీరోయిన్ కీర్తి సురేష్

Advertisement

తాజా వార్తలు

Advertisement