Sunday, April 28, 2024

పులిచింతలలో స్టాప్ లాక్స్ ఏర్పాటు.. డెడ్ స్టోరేజ్ కు చేరిన నీరు

పులిచింతల ప్రాజెక్ట్‌లో కనిష్ట స్థాయికి నీటిమట్టం చేరింది. ఎగువ నుంచి పూర్తిగా వరద ఉధృతి పూర్తిగా తగ్గిపోయింది. ప్రాజెక్టులో కొట్టుకుపోయిన 16వ గేట్ స్థానంలో స్టాప్ లాక్ అమరుస్తున్నారు. సాయంత్రం వరకు స్టాప్ లాక్స్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పులిచింతల 16, 17 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. 11 స్టాప్‌ లాక్‌ గేట్‌ ఫ్రేమ్‌లకు గానూ నిపుణులు 3 ఫ్రేమ్‌లను అమర్చారు. పులిచింతల ఇన్ ఫ్లో 15,517 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 70,740 క్యూసెక్కులుగా ఉంది. పులిచింతల పూర్తి నీటిమట్టం 175 అడుగులు కాగా.. ప్రస్తుతం 125.65 అడుగులకు చేరుకుంది. పులిచింతల పూర్తి నీటినిల్వ 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 5.28 టీఎంసీలు ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement