Wednesday, May 15, 2024

Big Story: పెళ్లి ఇప్పుడే ఎందుకు.. రిలేషన్‌లో ఉన్నాం కదా!

ఇప్పుడు అంతా లివింగ్​ రిలేషన్​ షిప్​ అనే ట్రెండ్​ నడుస్తోంది. దీన్నే ఫాలో అవుతున్నారు చాలామంది ముద్దుగుమ్మలు. ఎవరైనా పెళ్లెప్పుడు అని అడిగితే.. కొరకొరా వారివైపు కొరికేసేలా చూస్తూ.. ‘అదేం లేదు.. ఉంటే మీకు ముందే చెబుతాం కదా..”అంటూ మాట దాటేస్తున్నారు. కానీ, కొంతమంది మాత్రం తమకు ఇష్టమైన వ్యక్తులతో రిలేషన్​ మెయింటేయిన్​ చేస్తున్నారు. లవ్​ లైఫ్​ని ఎంజాయ్​ చేస్తూనే మూవీస్​లో బిజీగా ఉంటున్నారు. అట్లాంటి హీరోయిన్లలో ఎవరెవరున్నారో చదివి తెలుసుకుందాం..

కొంతమంది హీరోయిన్లు పెళ్లికేం తొందర అంటున్నారు. వారికి స్క్రీన్ లైఫ్ స్పాన్ తక్కువ కాబట్టి చాన్సులు వచ్చినప్పుడే కాసిన్నా కాసులు వెనకేసుకోవాలని ఉబలాటపడుతున్నారు. మంచి జోరుమీదున్నప్పుడే సినిమాలు చేసి పెళ్లిసంగతి తర్వాత చూసుకోవచ్చు అనుకుంటున్నారు. అందుకే పెళ్లి మాటెత్తకుండా లవ్ లైఫ్ ని లీడ్ చేస్తూ కూడా.. కెరీర్ మీదే ఫోకస్ పెడుతున్నారు. రిలేషన్లో కమిట్ అయ్యి ఉన్నా.. పెళ్లి మాత్రం ఇప్పుడే కాదంటున్నారు ఈ భామలు. ప్రేమలో మునిగితేలుతున్నా.. పనే ముఖ్యం అంటూ.. జోష్​ తగ్గడం లేదు.

పెళ్లి దేముంది ఎప్పుడైనా చేస్కోవచ్చు.. కానీ, కెరీర్ అలా కాదు కదా.. లైమ్ లైట్లో ఉన్నప్పుడే సినిమాలు చేసి సెటిల్ అవ్వాలనుకుంటున్నారు కొంతమంది భామలు.. అందుకే పెళ్లిని హోల్డ్ లో పెట్టి.. కెరీర్ లో ఫుల్ బిజీగా ఉంటున్నారు. సౌత్ టూ నార్త్ ఎక్కడ చాన్స్​ వచ్చినా వదలకుండా సినిమాలు చేస్తున్న రష్మిక కూడా ఇట్లాగే అంటోంది.. ‘‘పెళ్లికి ఇంకా చాల టైముంది. అసలు ఇప్పుడే పెళ్లెందుకు? చేస్కోవాలనిపించినప్పుడు చేస్కోవచ్చు. అయినా వీటన్నింటి గురించి ఆలోచించే టైమ్ లేదు”అంటోంది. హిందీలో 2, సౌత్ లో 3 సినిమాలతో బిజీ బిజీగా కెరీర్ మీదే ఫోకస్ చేస్తోంది ముద్దుగుమ్మ.

రకుల్​ప్రీత్​సింగ్​..
తన బర్త్ డే సందర్భంగా బాయ్ ప్రెండ్ జక్కీ భగ్నానీని పరిచయం చేసింది రకుల్ ప్రీత్ సింగ్. ఈ సుందరాంగి కూడా పెళ్లి మీద ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది. రిలేషన్ లో ఉన్నప్పటికీ పెళ్లి మాత్రం ఇప్పుడే కాదంటోంది. అసలు పెళ్లిగురించి ఆలోచించే తీరిక తనకు లేదని, చేతినిండా సినిమాలతో సౌత్ టు నార్త్ ఫుల్ బిజీగా ఉన్నాను అంటోంది. పెళ్లి మాత్రం ఎప్పుడు చేస్కోవాలని పిస్తే అప్పుడే చేస్కుంటానని ఫుల్ క్లారిటీ ఇచ్చిందీ వయ్యారి భామ.

శృతిహాసన్​..
శృతిహాసన్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రొఫెషనల్ గా బిజీ అవుతూనే.. అటు పర్సనల్ గా కూడా ఫుల్ ఎంగేజ్ అయిపోతోంది. తను ప్రస్తుతం రిలేషన్ లో ఉన్న శంతనుతో టైమ్ స్పెండ్ చేస్తున్న ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్​ చేస్తూ అభిమానులకు కనులవిందు చేస్తోందీ బ్యూటీ. ఆ వీడియోలు వైరల్ అవ్వడంతో ఆడియన్స్ కి తన రిలేషన్ గురించి క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అయితే.. పెళ్లి గురించి ఇప్పుడే ఏం ఆలోచించడం లేదని, ఎప్పుడు అనిపిస్తే అప్పుడే పెళ్లి చేసేసుకుంటా అంటూ తేల్చేసింది శృతి హాసన్. ప్రస్తుతం ఈ భామ ప్రభాస్, బాలకృష్ణ సినిమాలతో బిజీగా ఉంది.

- Advertisement -

నయనతార..

సౌత్​లో సక్సెస్ ఫుల్ కెరీర్ లీడ్ చేస్తున్న స్టార్ హీరోయిన్ నయనతార. యాక్టర్ కమ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో లవ్ లైఫ్ స్టార్ట్ చేసింది. కొన్నేళ్లుగా వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతూ డేటింగ్‌ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఎంగేజ్ మెంట్ అయిపోయిన ఈ జంట.. ఒక్క పెళ్లిని మాత్రం అలా పక్కనపెట్టేశారు. ప్రస్తుతం కెరీర్ లో డబ్బులు సంపాదించే పనిలో బిజీగా ఉన్నామని, ఆ తర్వాత తప్పకుండా పెళ్లి చేసుకుంటామని క్లారిటీ ఇచ్చింది ఈ జంట.

తాప్సీ పన్ను..

సౌత్​లో అంతంత మాత్రంగానే పేరు తెచ్చుకున్న తాప్సీ పన్ను.. బాలీవుడ్​లో తన అవకాశాలను పరీక్షించుకుంటోంది. అయితే తాప్సీ కూడా తన పెళ్లి మీద చాలా క్లియర్ గా ఉన్నానంటోంది. ఫారెన్ బ్యాడ్మింటన్ కోచ్ మథయాస్ బోతో రిలేషన్ లో ఉన్నది ఈ కుర్రది. ‘‘పెళ్లి గురించి మా ఇంట్లో కంగారు పడుతున్నారు. కెరీర్ లో బిజీగా ఉన్నా కాబట్టి.. సంవత్సరానికి కనీసం రెండు సినిమా చాన్సులు కూడా రాకపోతే అప్పుడే పెళ్లిగురించి ఆలోచిస్తా’’ అని ఫ్యాన్స్ కి తన పెళ్లి సంగతులు చెప్పేసింది వయ్యారి.

ఆలియా భట్​..

బాలీవుడ్​లో మాంచి జోరుమీదున్న ఆలియా భట్ కూడా దాదాపు ఇదే స్టేజ్ లో ఉంది. రణబీర్ సింగ్ తో లవ్ లో ఉన్న ఈ కుర్రది.. ప్రస్తుతం తన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉంది. ‘‘అదిగో పెళ్లి, ఇదిగో పెళ్లి’’ అని అందరూ ఇష్టంవచ్చినట్టు వార్తలు రాస్తున్నా కూడా.. అస్సలు పట్టించుకోవట్లేదు. బాలీవుడ్ టూ టాలీవుడ్.. వరసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈ భామ. ప్రస్తుతం షంషేరా, ట్రిపుల్ఆర్, గంగూభాయ్ సినిమాలతో పాటు ఎన్టీఆర్ తో సినిమా కమిట్ అయ్యింది ఈ బ్యూటీ.

కియారా అద్వానీ..

సిద్దార్ద్ మల్హోత్రాతో పీకల్లోతు ప్రేమలో ఉన్న కియారా అద్వానీ కూడా ‘‘పెళ్లిదేముంది తర్వాత చేసుకోవచ్చు”అంటోంది. ఇద్దరూ కలిసి పార్టీలకు, వెకేషన్లకు వెళ్తున్నా పెళ్లి మాటమాత్రం ఎత్తడం లేదు. షేర్​షా హిట్ కావడంతో సక్సెస్ లో ఉన్న సిద్దార్ద్ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటే.. భూల్ భులయ్యా, జుగ్ జుగ్ జియో, ఆదిపురుష్ వంటి సినిమాలతో పాటు.. రామ్ చరణ్ తో వరుసగా సినిమాలు లైన్లో పెట్టింది కియారా. ఇలా కెరీర్ మీద ఫోకస్ చేస్తూ.. ఖాళీగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అవుతున్నారు ఈ న్యూ జనరేషన్ హీరోయిన్లు.

Advertisement

తాజా వార్తలు

Advertisement