Sunday, April 28, 2024

ఆర్కే మృతిపై సందేహాలు.. దండకారణ్యానికి దిక్కెవరు?

మావో అగ్రనేత అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్‌కె మరణంపై పలు సందేహాలున్నాయి. ఇది అనారోగ్యం కారణంగా సంభవించిందా లేక ఆపరేషన్‌ సమాధాన్‌లో భాగంగా జరిగిందా అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి ఇతమిత్థమైన విచారణ జరిగే అవకాశం కనిపించడంలేదు. ఆయన మరణానికి దారితీసిన కారణాల్ని అలా ఉంచితే హరగోపాల్‌ మరణం దేశంలో మావోయిస్టు ఉద్యమ ఉధృతికి విఘాతం కలిగించే అవకాశాల్ని నిపుణుల ు ధృవీకరిస్తున్నారు.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి: కొన్నేళ్ళుగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో హరగోపాల్‌ కీలకంగా వ్యవహరిం చారు. కమిటీలో మొత్తం 14మంది సభ్యులున్నప్పటికీ వ్యూహాల రచనతో పాటు అమలులో హరగోపాల్‌ సిద్దహస్తుడు. దేశంలో ఇప్పుడు పది రాష్ట్రాల్లో మాత్రమే మావోల ప్రభావం బలంగా ఉంది. చత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఒడిషా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, మధ్యప్రదేశ్‌, బీహార్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మహరాష్ట్రల్లో మావోలు కొన్ని ప్రాంతాలపై గట్టి పట్టు కొనసాగిస్తున్నారు. ఇన్ని రాష్ట్రాల్లో మావోయిజం ఉనికి చాటుతున్నప్పటికీ పార్టీ కేంద్ర కమిటీలో ఉన్న మొత్తం సభ్యులంతా తెలుగువారే. వీరిలో కొందరు ఇప్పటికే మరణించారు. మరికొందరు తీవ్ర అనారోగ్యంతో సతమతమౌతున్నారు. ఈ దశలో హరగోపాల్‌ అకాల మరణం చెందారు. ఉద్యమానికి ఊపిరిలూదిన గణపతి వార్ధక్యానికి గురయ్యారు. పలు అనారోగ్య సమస్యలు ఆయన్ను చుట్టుముట్టాయి. ఒకరు అనారోగ్యంతో మృతిచెందగా ఇద్దరు కరోనాతో ఆకస్మాత్తుగా చనిపోయారు. హరగోపాల్‌ మరణంతో కేంద్ర కమిటీలో నలుగురు దివంగతులయ్యారు. హరగోపాల్‌ మరణం మావోయిస్టుల మనోధైర్యాన్ని దెబ్బతీసే అవకాశం కనిపిస్తోంది. మావోలకు కంచుకోటైన దండకారణ్యంలోని ఆంధ్రా-ఒడిషా బోర్డర్‌ పరిధిలో హరగోపాల్‌ చూపిన ప్రభావం అనన్యసామాన్యం. హరగోపాల్‌ సుమారు 20సార్లు పోలీస్‌ ఎన్‌కౌంటర్ల నుంచి తప్పించుకోగలిగారు. ఆయనపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కలిపి సుమారు కోటిన్నరకు పైగా రివార్డులు ప్రకటించాయి.

అక్కిరాజు మరణం భారత్‌లో మావోయిస్టు ఉద్యమ ప్రగతిపై ప్రభావం చూపిస్తే అదిపరోక్షంగా దేశంలోని పదికోట్ల గిరిజనుల జీవితాల్ని అభద్రతకు లోనుచేస్తుంది. భారత్‌లోని పదికోట్లకు పైగా గిరిజనులు దట్టమైన అడవులున్న రాష్ట్రాల్లో జీవిస్తున్నారు. వీరుంటున్న అటవీ ప్రాంతాలు ఇనుము, బాక్సైట్‌, లాటరైట్‌, మాంగనీస్‌ , అబ్ర కం, మైకావంటి అత్యంత విలువైన ఖనిజ సంపద ఉంది. స్వాతంత్య్రానికి ముందు నుంచి ఈ అటవీ సంపదను తర లించుకెళ్ళే ప్రయత్నాలు మొదలయ్యాయి. అప్పట్లో అల్లూ రి సీతారామరాజు వంటి యోధులు ఈ సంపద తర లింపునకు వ్యతిరేకంగా ఉద్యమించారు. అటవీ సంపదను కొల్లగొట్టే క్రమంలో గిరిజనులపై బ్రిటీష్‌ ప్రభుత్వం సాగిం చిన అణిచివేతకు వ్యతిరేకంగా పోరాటానికి శ్రీకారం చుట్టారు. మన్యంలో ప్రభుత్వ విధానాలపై పితూరి లేపారు. అంచెలంచెలుగా గిరిజన హక్కుల పోరాట ం భారత స్వాతంత్య్ర సంగ్రామంలో భాగంగా మారింది. గిరిజనుల కోసం బ్రిటీషీయులపై అప్పటికి అందుబాటులో ఉన్న సంప్రదాయ ఆయుధాల్తోనే అల్లూరి యుద్దానికి దిగాడు. స్వాతంత్య్రానంతరం కూడా అటవీ సంపద విచ్చలవిడి దోపిడీ కొనసాగుతూనే ఉంది. సొంత పాలకులే ఇందుకు అనుమతులు జారీ చేస్తున్నారు. జాతీయ సం స్థల్తో పాటు విదేశీ సంస్థల్ని కూడా ఇక్కడ సంపద గుర్తింపు, వెలికితీత, తరలింపులకు అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో గిరిజనుల ఆవాసాలు కుప్పకూలిపోతున్నాయి. వారిసంస్కృతి సంప్రదాయాలు మంటగలుస్తున్నాయి. గిరిజనులకు రక్షణ కొరవడుతోంది. వార్ని బలవంతంగా ఆవాసాల్నుంచి వెళ్ళగొడుతున్నారు. అటవీ సంపద విచ్చలవిడి దోపిడీకి అడ్డొచ్చిన వార్ని అడ్డంగా చంపేస్తున్నారు. ఈ క్రమంలో గిరిజనులకు మావోయిస్టులే మెరుగైన అండగా మారారు. సంపద దోపిడీదార్లను మావోలు నిలదీస్తున్నారు. గిరిజనులపై అణిచివేతను ఎదుర్కొంటున్నారు. గిరిజనం లో చైతన్యం కల్పిస్తున్నారు. ప్ర జాకోర్టుల నిర్వహణ ద్వారా అక్రమార్కుల్లో భయం పుట్టిస్తున్నారు.

- Advertisement -

మావోల చర్యలు భారత చట్టాల మేరకు ఆమోద యాగ్యమైనవికాదు. కానీ అడవి తల్లినే నమ్ముకుని జీవిస్తున్న గిరిజనుల హక్కుల పరిరక్షణలో వీరనుసరిస్తున్న విధానాలు సానుకూల ఫలితాల్నిస్తున్నాయి. గిరిజనుల హక్కుల పరిరక్షణకు ఉపకరిస్తున్నాయి. పెద్దపెద్ద పారి శ్రామిక, వాణిజ్యవేత్తలు అటవీ ప్రాంతంలో వందలు, వేల ఎకరాల్లో విచ్చలవిడిగా గంజాయి పండిస్తున్నారు. పేద గిరిజన యువకుల్ని ఆకర్షించి ఈ గంజాయిని ముంబయ్‌ వంటి నగరాలకు రవాణా చేస్తున్నారు. అయితే ఈ గిరిజ నులంతా కేవలం రవాణా సాధనాలే తప్ప సొంతంగా గంజాయి పండించి దాన్ని తరలించి వ్యాపారం చేయగలిగే సామర్ద్యం వీరికుండదు. కానీ తరచూ రవాణా సందర్భాల్లో గిరిజనులు పోలీసులుకు పట్టుబడుతున్నారు. వారిపైనే అభియోగాలు మోపబడుతున్నాయి. దండకారణ్యంలో మావోల ప్రభావం మరింత తగ్గితే విచ్చలవిడి గంజాయి సాగు, మాదకద్రవ్యాల రవాణా వ్యాపారం మరింత విస్తృతమయ్యే ప్రమాదముంది. అలాగే బాక్సైట్‌, మాం గనీస్‌, అల్యుమినియం, ఇనుప ఖనిజాల తవ్వకం, రవా ణాలు మరింత విస్తృత స్థాయిలో జరుగుతాయి. ఇది శతా బ్ధాల తరబడి గిరిజనులు కాపాడుకుంటున్న సాంస్కృతిక సంప్రదాయాలను కుప్పకూలుస్తుంది. గిరిజనుల ప్రాణాలక్కూడా ముప్పుతెస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మావోయిజాన్ని ప్రోత్సహించకుండానే ఆ పార్టీ ప్రభావం తగ్గుతున్న నేపధ్యంలో గిరిజనుల హక్కులు, భూములు, సంప్రదాయాల పరిరక్షణకు ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. అటవీ, ప్రకృతి సంపద వి చ్చలవిడి దోపిడీని నియంత్రించాలి. లేనిపక్షంలో గిరిజన యువత మావోయిజం వైపు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణించే ప్రమాదముంటుందని, ఇది దేశంలో మావోయిస్టు ఉద్యమ ఉధృతికి దారితీసే అవకాశం లేకపోలేదని వీరు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement