Friday, April 26, 2024

కరోనా టీకా వేయించుకుంటున్నారా? ఎలాంటి ఆహారం తినాలి?

దేశంలో కరోనా వైరస్​ ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతున్న వేళ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఊపందుకుంది. టీకా వేయించుకునేందుకు ప్రజలు పెద్దఎత్తున ముందుకొస్తున్నారు. అయితే వ్యాక్సిన్​ వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి కొందరిలో ఆందోళన ఉంది. దీని గురించి అసలు దిగులు అక్కర్లేదని నిపుణులు చెబుతున్నారు. సరైన ఆహారాన్ని తీసుకుంటే ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని పేర్కొన్నారు. టీకాకు ముందు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, ఎలాంటి పనులు చేయకూడదో వారు వివరించారు.

టీకాకు ముందు చేయకూడని పనులు:
★ పొగతాగరాదు
★ ఖాళీ కడుపుతో టీకా వేయించుకోరాదు
★ కనీసం 24 గంటల ముందు మద్యం సేవించరాదు
★ శీతల పానీయాలకు దూరంగా ఉండాలి

టీకాకు ముందు తీసుకోవాల్సిన ఆహారాలు:
★ తాజా పండ్లు తీసుకోవాలి. ఎందుకంటే వాటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి
★ టీకా వేయించుకోవడానికి ముందు బ్లూ బెర్రీస్, చికెన్, డార్క్ చాక్‌లెట్, ఆలివ్ నూనె వంటివి మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి
★ ఆకుకూరలు: వీటిల్లో అనేక ఖనిజాలు, పోషకాలు ఉంటాయి. అందుకే టీకాకు ముందు బచ్చలికూర, బ్రకోలీ వంటి ఆకుకూరలు మీరు తీసుకునే ఆహారంలో చేర్చుకోండి
★ పసుపు: ఇది సహజ సిద్ధమైన ఆరోగ్య ఔషధం. ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా కాపాడుతుంది. అందుకే టీకాకు ముందు తినే ఆహారంలో పసుపు ఉండేలా చూసుకోవాలి. పసుపును కూరలు లేదా పాలల్లో కలిపి తీసుకోవచ్చు.
★ వెల్లుల్లి: ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ప్రొ బయోటిక్స్ మెండుగా ఉంటాయి. కాబట్టి టీకాకు ముందు తినే ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోండి
★ అల్లం: రక్తపోటు, హృద్రోగ సమస్యలు, ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ను నియంత్రించేందుకు అల్లం ఉపయోగపడుతుంది. టీకా తీసుకునే సమయంలో ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు ఆహారంలో అల్లంను చేర్చుకుంటే మంచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement