Wednesday, May 15, 2024

సింహం మీ ఎదురుగా వ‌స్తే ఏం చేస్తారు.. వీళ్లేం చేశారో చూడండి!

వీడియోల్లోనో.. సినిమాల్లోనో సింహాన్ని చూడ్డమే కానీ, చాలా మంది రియ‌ల్‌గా చూసి ఉండ‌క‌పోవ‌చ్చు. కానీ, ఓ జంట‌కు మాత్రం అత్యంత అరుదైన సన్నివేశం గోచ‌రించింది. వారు వెళ్తున్న దారిలో సింహం ఎదురైంది. ఇక అంతే బైక్‌ను ఆపేసి అలాగే ఉండిపోయారు. ఎదురుగా వ‌చ్చిన సింహం వారిని ఏమ‌న‌కుండానే ప‌క్క‌నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడీ వీడియో సోష‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది..

ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా ట్వీట్ చేసిన వీడియో అంత‌టా వైర‌ల్ అవుతోంది. గుజ‌రాత్‌లోని ఓ గ్రామంలో సింహం రోడ్డు దాటుతుండ‌గా.. అదే రోడ్డుపై ఓ జంట బైక్‌పై వెళుతూ సింహాన్ని చూసి ఆగారు. దీంతో సింహం వారి వైపు న‌డుచుకుంటూ వ‌స్తున్న వీడియో చూస్తుంటేనే గుండె ఝ‌ల్లుమ‌నేలా ఉంది.. మ‌రి సింహం వారి వైపు స‌మీపిస్తున్న త‌రుణంలో బైక్ పై ఆ జంట ప‌రిస్థితి గురించి వ‌ర్ణించ‌డం కూడా చాలా క‌ష్టమే.. అయితే.. ఆ సింహం వేటాడే మూడ్‌లో లేనట్టుంది. బైక్‌పై ఉన్న జంట స‌మీపానికి వ‌చ్చిందే కానీ, వారిపై దాడి చేయ‌కుండా రోడ్డు దాటి అడ‌విలోకి వెళ్లిపోయింది. ఇక సింహం ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నా.. బైక్ పై వెనుక కూర్చున్న మ‌హిళ దాన్ని అలా వీడియో తీయ‌డం కూడా ఓ సాహ‌స‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. ఆ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత ట్విట్ట‌ర్‌లో పోస్టు చేయ‌డంతో ఇప్ప‌టి వ‌ర‌కు వేలాది మంది వీక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement