Sunday, May 5, 2024

ఏమైంది ఈ న‌గ‌రానికి.. ఓ వైపు చ‌లి, మ‌రో వైపు కాలుష్యం..

రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు నగర ప్రజలను మరో ప్రమాదానికి గురిచేస్తున్నాయి. ఉష్ణోగ్రతలు తగ్గడంతో వాతావరణ కాలుష్యం కూడా పెరుగుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు రోజురోజుకి పడిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సింగిల్‌ డిజిట్‌ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పడిపోతున్న ఉష్ణోగ్రతలు కారణంగా వాయు కాలుష్యం స్థాయి గతం కంటే చాలా పెరిగిందని వాతావరణ శాఖ నివేదికలు చెబుతున్నాయి. సిటీ ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ బాగా క్షీణించింది. బొల్లారం, పటాన్‌చెరు, రాజేంద్రనగర్‌తో సహా నగరంలోని అనేక ప్రాంతాలలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ 101 – 200 ఉంది. అయితే ఈ పరిస్థితి ఊపిరితిత్తులు, గుండె సంబంధిత రోగులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలిగించేంతగా గాలిలో కాలుష్యం దట్టంగా ఉందని, ఇది ప్రమాదకర స్థాయి అని వాతావరణ శాఖ నిపుణులు అంటున్నారు. మరోవైపు ఎన్నడూ లేని విధంగా నగరంలో సనత్‌నగర్‌ వద్ద 261 పాయింట్లు ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ నమోదైందని తెలిపారు. చల్లటి గాలి ఉపరి తలంపైన వెచ్చని గాలి పొరపై కూర్చొని, కాలుష్యం, అలెర్జీ కారకాల రసాయనాలను ఉత్పత్తి చేయడం వలన గాలిలో కాలుష్యం స్థాయి ఈ సీజన్‌లో పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

అయితే గతంలో ఎన్నడూలేని విధంగా ఈ స్థాయిలో ఇప్పుడు సిటీలో కాలుష్యం పెరగడం కలవరపెట్టే అంశంగా మారింది. గాలి కాలుష్యం వాతావరణంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. శీతాకాలంలో, చల్లని గాలి దట్టంగా ఉంటుంది వెచ్చని గాలి కంటే నెమ్మదిగా కదులుతుంది. దీంతో చల్లటి గాలి కాలుష్య స్థాయిని పెంచుతుంది. ప్రతి సంవత్సరం హైదరాబాద్‌లో చలికాలం వచ్చే సరికి ఏక్యూవన్‌ స్థాయిలు పెరగడం సహజంగానే జరుగుతాయి. అయితే ఆ స్థాయిలు ఇప్పుడు గణనీయంగా పెరగియి. శీతాకాలంలో గాలిలో తేలియాడే టాక్సి క్స్‌ అనేక రకాల కాలుష్య కారకాలతో కూడి ఉంటాయి, వీటిలో సల్ఫర్‌ డయాక్సైడ్‌, నైట్రోజన్‌ డయాక్సైడ్‌, పీఎం 10, ఓజోన్‌, పీఎం 2.5 ప్రదానమైనవి, అయితే ఇవే ఈ సమయంలో గాలిలో కాలుష్యం స్థాయి పెంచడానికి కారణాలుగా పనిచేస్తాయి. ఈ రసాయనాలు సాధారణంగా ఉబ్బసం లేదా ఇతర ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు రావడానికి కారణమవుతాయి వైద్య నిపుణులు అంటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement