Sunday, May 5, 2024

సీబీఐని స్వాగ‌తిస్తున్నాం-ద‌ర్యాప్తు సంస్థ‌కు పూర్తిగా స‌హ‌క‌రిస్తాం-సీఎం కేజ్రీవాల్

డిప్యూటీ సీఎం మ‌నీశ్ సిసోడియో ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వ‌హిస్తోంది.కాగా సీబీఐని స్వాగ‌తిస్తున్నాన‌ని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. త‌న ట్విట్ట‌ర్‌లో రియాక్ట్ అయ్యారు కేజ్రీవాల్. సీబీఐని స్వాగ‌తిస్తున్న‌ట్లు చెప్పిన కేజ్రీవాల్.. ఆ ద‌ర్యాప్తు సంస్థ‌కు పూర్తిగా స‌హ‌క‌రించ‌నున్న‌ట్లు తెలిపారు. ఈ విచార‌ణ ద్వారా ఏమీ బ‌య‌ట‌కురాద‌నే న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం ఢిల్లీలో సుమారు 20 ప్రాంతాల్లో సోదాల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఢిల్లీలో స్కూళ్ల అభివృద్ధి కోసం సిసోడియా ఎంతో చేశార‌ని, ఢిల్లీ ఎడ్యుకేష‌న్ మోడ‌ల్‌ను ప్ర‌శంసిస్తూ అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ ప‌త్రిక‌లో నేడు ఫ్రంట్ పేజీలో క‌థ‌నం ప్ర‌చురిత‌మైంద‌ని, అయితే ఆ రోజునే కేంద్ర ప్ర‌భుత్వం సిసోడియాపై త‌నిఖీలు చేప‌ట్ట‌డం శోచ‌నీయ‌మ‌న్నారు. గ‌తంలో త‌మ‌పై ఎన్నోసార్లు సోదాలు జ‌రిగాయ‌ని కేజ్రీ అన్నారు. ఢిల్లీ ప్ర‌భుత్వం ఇటీవ‌ల కొత్త ఎక్సైజ్ పాల‌సీని ఉప‌సంహ‌రించుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ విధానం అమ‌లులో భారీ అక్ర‌మాలు చోటుచేసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఇవాళ ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీశ్ సిసోడియో ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వ‌హిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement