Wednesday, May 15, 2024

ప్ర‌జ‌ల సంద‌ర్శ‌న కోసం రాష్ట్ర‌ప‌తి నిల‌యం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: చారిత్రాత్మకమైన భాగ్యనగరం తట్టితేనేచాలు చారిత్రక కట్టడాలు గతవైభవచిహ్నాలు దర్శన మిస్తాయి. రాజులు, మహరాజుల భవనాలు కనులవిందు చేస్తాయి. ఈ ప్రాచీన కట్టడాల్లో నిజాం నజీర్‌ ఉద్‌దౌల నిర్మించిన విలాసవంతమైన భవనం స్వాతంత్య్రం అనంతరం రాష్ట్ర పతి నిలయంగా హైదరాబాద్‌ కీర్తి ప్రతిష్టలను ఇనుమ డింప చేస్తున్నది. అయితే సాక్ష్యాత్తు రాష్ట్రపతి విడిది గృహంగా ఉన్న ఈ అపూరూప కట్టడాన్ని సందర్శించాలనే మనసుపుట ల్లోని ప్రజల కోరికను తీర్చేందుకు భారత రాష్ట్రపతి నిలయం నిర్ణయం తీసుకుంది. శీతాకాలంలో కొద్ది రోజులు మినహా ప్రతిరోజు రాష్ట్రపతి భవన్‌ సందర్శించేందుకు పర్యాటకులకు అవకాశం కల్పించింది.


రాష్ట్రపతి భవన్‌ను వీక్షించేందుకు అధికారికంగా అవకాశం దొరికితే ఎవరైనా వదులుకుంటారా? ఎప్పుడు అవకాశం వస్తుందా? అని వీక్షిస్తుంటారు. రాష్ట్రపతి భవన్‌కు ఉన్న చరిత్ర అలాంటిది. ఆ చరిత్ర తెలుకునేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. ప్రజల కోరికను పరిగణలోకి తీసుకున్న కేంద్రప్రభుత్వం ఏడాది పొడవునా ప్రజలు సందర్శించేందుకు అవకాశాలు కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ సెలవుదినాలు మినహా మిగిలిన అన్ని రోజుల్లో రాష్ట్రపతి నిలయాన్ని సద ర్శించే అవకాశాలు కల్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వర్చువల్‌గా ఢిల్లిలోని రాష్ట్రపతి భవన్‌ నుంచి ప్రారంభిం చారు. అలాగే హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నివాసంలోని మెట్లబావి, జైహింద్‌ ర్యాంపు పునరుద్ధరణనకు కూడా రాష్ట్రపతి ఆమోదించారు.


బ్రిటీష్‌ వైశ్రాయ్‌ అతిథిగృహంగా 1850లో నిజాం నజీర్‌ ఉల్‌ ఉద్‌ దౌలా ఈ భవనాన్ని నిర్మించారు. 1805లో బ్రిటీష్‌ వైశ్రాయ్‌ ఇందులో విడిదిచేశారు. ఆతర్వాత బ్రిటీష్‌ ఉన్నతాధి కారులు అతిథి గృహంగా వినియోగించారు. అయితే అప్పట్లో ఈ భవనాన్ని వైశ్రాయ్‌ గృహంగా పిలిచే వారు. 1857లో కోఠిలోని బ్రిటీష్‌ రెసిడెన్సీపై సిపాయిల తిరుగుబాటు జరగడంతో అప్పటికే బ్రిటీష్‌ కంటోన్మెంట్‌ ప్రాంతంగా ఉన్న బొల్లారంలోని ఈ భవనాన్ని బ్రిటీష్‌ రెసిడెన్సీగా ఉపయోగిం చుకున్నారు. నిజాం ఆస్తుల్లో భాగమైన ఈ భవనాన్ని కేంద్ర ప్ర భుత్వం రూ.60 లక్షలకు కొనుగోలు చేసింది. 1950లో కేంద్ర ప్రభుత్వం ఈ భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని రాష్ట్రపతి నిలయంగా తీర్చిదిద్దారు. దేశపాలన ఉత్తర భారతానికే పరిమితం కాకుండా దక్షిణాన కొద్దిరోజులు రాష్ట్రపతి విడిది చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను కేంద్ర ప్రభుత్వం చేసింది. అయితే సివ్లూలోనూ రాష్ట్రపతి భవన్‌ ఉంది. 160 సంవ త్సరాల చరిత్ర ఉన్న ఈ భవనంలో కనులవిందుచేసే ప్రత్యేకతలుఎన్నో ఉన్నాయి.

ఈ భవనాన్ని సందర్శించేందుకు ఆన్‌లైన్‌ బుకింగ్‌ అవకాశం ఉంది. అక్కడికివెళ్లి నేరుగా టిక్కెట్లు తీసుకునే అవకాశం కూడా ఉంది. భారతీయులకు రూ.50. విదేశీయులకు రూ.250 టిక్కెట్‌ ధరగా నిర్దారించారు. అలాగే సందర్శకుల కోసం రాష్ట్రపతి భవన్‌లో ఉచితంగా పార్కింగ్‌, వస్తువులను భద్రప ర్చుకునేందుకు ప్రత్యేక గది ఉంది. మంచినీరు, ప్రాథమిక చికిత్స సహా ఇతర వసతులను ఏర్పాటు చేశారు. ఈ చారిత్రక భవనంలో ఆధునీకరించిన ఆర్ట్‌ గ్యాలరీ, భూగర్భ సొరంగ మార్గం, రాక్‌ గార్డెన్‌, హెర్బల్‌ గార్డెన్‌, బట్టర్‌ ప్లై గార్డెన్‌, ఛత్ర గార్డెన్‌,జైహింద్‌ ర్యాంపు, ప్లాగ్‌ పోస్టు తదితర సౌకర్యాలు న్నాయి. రాష్ట్రపతి నిలయంలో 20కి పైగా గదులు ప్రత్యేక అలంకరణతో ఆకర్షిస్తున్నాయి. 75 ఎకరాల పచ్చని తోటలతో ఇక్కడ ప్రకృతి పరవశిస్తుంది. నిలయంలోని 1.20 ఎకరాల్లో 27 నక్షత్రాలు, తొమ్మిది గ్రహాల పేర్లతో వృత్తాకార ఉద్యాన వనం ఆకట్టుకుంటుంది. బ్రిటీష్‌ కాలంలో వ్యవసాయానికి ఉపయో గించిన ఊటబావులు, నాటి వ్యవసాయ విధానం ఇప్పటికీ ఇక్కడ అగుపిస్తుంది. ఉద్యానవనాలు, పూలు, పండ్ల తోటలు, ఫౌంటెన్లు చూడముచ్చటగా ఉంటాయి. గతసంవ త్సరం రాష్ట్రపతి సంద ర్శించినప్పుడు ప్రత్యేకంగా 7వేల ఔషధగుణాల మొక్కలు నాటారు. భారీ వృక్షాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌ హయాం నుంచి ఇక్కడ రాష్ట్రపతులు విడిది చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement