Saturday, May 4, 2024

శాకుంత‌లంకి క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్.. రన్‌టైం 142 నిమిషాలు

శాకుంత‌లం చిత్రానికి సెన్సార్‌ బోర్డు క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శాకుంత‌ల‌గా స్టార్ హీరోయిన్ స‌మంత న‌టిస్తోంది. ఈ చిత్రంలో మలయాళ యాక్టర్‌ దేవ్‌ మోహన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. దేవ్‌ మోహన్‌ దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నాడు. తాజా అప్‌డేట్ ప్రకారం శాకుంతలం రన్‌టైం 142 నిమిషాలు ( 2 గంటల 22 నిమిషాలు). ఈ చిత్రాన్ని గుణ టీమ్‌ వర్క్స్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. శాకుంతలం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి సాయి మాధవ్‌ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన శాకుంతలం టీజర్‌, ట్రైలర్‌తోపాటు పాటలకు మంచి స్పందన వస్తోంది. కాగా అనన్య నాగళ్ల, అదితీ మోహన్‌, ప్రకాశ్‌ రాజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement