Saturday, May 18, 2024

వైరల్ అవుతున్న 1954లోని ‘ఆంధ్రప్రభ’ కథనం

ఏపీలో ఇటీవల మరో ఎయిర్‌పోర్టు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. అదే కర్నూలు విమానాశ్రయం. కానీ ఈ విమానాశ్రయం 1954లోనే రావాల్సి ఉంది. అప్పట్లో కర్నూలులో విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఏపీ మంత్రి చెప్పిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన ఫోటో ‘ఆంధ్రప్రభ’ పత్రికలో ప్రచురణ అయ్యింది కావడం విశేషం. అప్పుడు, ఇప్పుడు కర్నూలు ఎయిర్‌పోర్టుపై ఆంధ్రప్రభ ఎన్నో కథనాలు అందించింది. కాగా ఎయిర్‌పోర్టు ఏర్పాటు ఆలస్యంపై నెటిజన్లు స్పందిస్తూ జస్ట్ 67 ఏళ్లు మాత్రమే ఆలస్యమైందని ఎద్దేవా చేస్తున్నారు.

1954లో ఏపీ ఆర్ధిక మంత్రి విశ్వనాథం రూ.13 లక్షల ఖర్చుతో కర్నూలులో విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని మీడియా సాక్షిగా వెల్లడించారు. ఎందుకంటే ఆనాడు ఏపీకి కర్నూలు రాజధానిగా ఉండేది. అందువల్ల రాజధాని ప్రజలకు విమాన సౌకర్యం కల్పించాలని అప్పటి ప్రభుత్వం కృషి చేసింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు కర్నూలుకు 18 కి.మీ. దూరంలో 2013లో విమానాశ్రయం ఏర్పాటుకు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2017లో ఈ ఎయిర్‌పోర్టుకు అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయగా 18 నెలల్లో విమానాశ్రయం పనులు పూర్తయ్యాయి. 2019లోనే చంద్రబాబు ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించగా రన్‌వే పనులు పూర్తి కాకపోవడంతో విమాన రాకపోకలు మాత్రం ప్రయాణికులకు అందుబాటులోకి రాలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో రూ.110 కోట్ల వ్యయంతో రన్ వే, అభివృద్ధి పనులను పూర్తి చేసి ఇటీవల విమాన రాకపోకలను ప్రారంభించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement