Sunday, May 12, 2024

‘విక్ర‌మ్’ రిలీజ్ డేట్ లాక్ – మార్చి 14న ప్ర‌క‌ట‌న‌

త‌మిళ రాజ‌కీయాల్లో బిజీగా ఉండ‌టంతో విశ్వ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ సినిమాల‌కి కొంచెం గ్యాప్ ఇచ్చారు. భారతీయుడు 2 సినిమా స్టార్ట్ చేసినా.. కొన్ని వివాదాల వల్ల ఆ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. భారతీయుడు సినిమా తరువాత ఆయన ప్రకటించిన సినిమా విక్రమ్. లాక్ డౌన్ కష్టాలను దాటుకుని షూటింగ్ చేసుకున్న ఈమూవీ సైలెంట్ గా రిలీజ్ కు రెడీ అయ్యింది. అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ త్వరలోనే విక్రమ్‌ గా రానున్నాడు కమల్ హాసన్. ఖైదీ, మాస్టర్‌ లాంటి సూపర్ హిట్ సినిమాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ను రూపొందిస్తున్నారు. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కమల్‌తో పాటు ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా విక్రమ్‌ సినిమాలో గ్యాంగ్ స్టర్ గా కమల్ కనిపించనున్నారు.

కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్‌కుఅద్భుతమైన స్పందన వచ్చింది. కాగా తాజాగా విక్రమ్‌ సినిమా షూటింగ్‌ పూర్తైనట్లు మూవీ టీమ్ ప్రకటించింది.అంతే కాదు సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయబోతున్నారు. ఫహద్ ఫాజిల్ గన్ పేల్చే వీడియోను విడుదల చేసిన మేకర్స్..మూవీ రిలీజ్ డేట్ ను కూడా లాక్ చేశారు. మార్చి14న విక్రమ్ చిత్రం విడుదల తేదీని ప్రకటించబోతున్నట్టు ట్విట్టర్‌ వేదికగా చిత్రబృందం ప్రకటించింది. తెలుగులో కూడా విక్రమ్ పేరుతోనే రిలజ్ కాబోతున్న ఈ సినిమాలో మలయాళ నటుడు జయరామ్ తనయుడు కాళిదాస్ జయరాం, నరేన్ , ఆంటోనీ వర్గీస్, అర్జున్ దాస్, శివానీ నారాయణన్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ సినిమాకు గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. కమల్ హాసన్ ఆశలన్నీ ఈసినిమాపైనే పెట్టుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement