Wednesday, December 11, 2024

పూరీ జ‌గ‌న్నాథ్ తో ‘విజ‌య్ దేవ‌ర‌కొండ’ నెక్స్ట్ మూవీ – టైటిల్ రిలీజ్

ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ లైగ‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఈ చిత్రం విడుద‌ల కాక‌ముందే హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో మ‌రో చిత్రాన్ని ఎనౌన్స్ చేశాడు పూరీ. ఈ మేర‌కు పోస్ట‌ర్ ని రిలీజ్ చేశారు.లైగర్‌ పూర్తి కాగానే.. మరో పాన్‌ ఇండియా సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. ఈ సినిమాకు ‘జనగణమన’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసింది. అంతేకాదు ఈ సినిమాను 2023 ఆగస్టు 3వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ సినిమా పూరి సొంత బ్యానర్ లోనే తెరకెక్కుతోంది. ఈ మేరకు ఓ అదిరిపోయే పోస్టులు కూడా వదిలింది చిత్రబృందం.

Advertisement

తాజా వార్తలు

Advertisement