Sunday, May 5, 2024

యధేచ్చగా వాహనాలతో రోడ్లపైకి!

తెలంగాణలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగుతున్నా… లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘించి కొంత మంది ప్రజలు ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నారు. హైదరాబాద్ నగరంలో సాధారణ పరిస్ధితులు కనిపిస్తున్నాయి. లాక్ డౌన్ ఆంక్షలతో గత 10 రోజులుగా ఇళ్లకే పరిమితమైన ప్రజలు.. పలు ప్రాంతాల్లో మాత్రం వాహనాలతో రోడ్లపై తిరుగుతున్నారు. సినిమా హాల్స్, రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్, రవాణా వ్యవస్థలపై ఆంక్షలు అమలులో ఉన్నప్పటికి జనాలు విచ్చలవిడిగా రోడ్లపై కనిపిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి లాక్ డౌన్ అమలు అవుతున్నా.. సంతోష్ నగర్, చంపాపేట్, సైదాబాద్ ప్రాంతాల్లో యధావిధిగా వాహనాలు తిరుగుతున్నాయి. లాక్ డౌన్ సీరియస్ నెస్ మరుగునపడిపోయినట్టు తెలుస్తోంది. ప్రతిపోలీసు స్టేషన్ పరిధిలో ప్రధాన రహదారుల మీద చెక్ పోస్టులు పెట్టి జనాన్ని కట్టడి చేసిన పోలీసులు కూడా ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో హైదరాబాద్ నగరంలో సాధారణ పరిస్ధితులు నెలకొన్నట్టు కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement