Sunday, April 28, 2024

Spl Story | వరుణ్​ధవన్​తో సమంత రొమాన్స్​.. సెర్బియాలో స్పై సిరీస్​ సిటాడెల్​ షూటింగ్​!

ప్రైమ్​ వీడియోస్​లో పార్ట్​‌‌–1గా వచ్చిన స్పై ఓరియంటెడ్​ సిరీస్​ సిటాడెల్​ సూపర్​ సక్సెస్​ అయ్యింది. ఇందులో వరల్డ్​ ఫేమస్​ బ్యూటి అయిన ప్రియాంక చోప్రా నటించింది. తన అందచందాలతో అభిమానులను అబ్బురపరిచింది ప్రియాంక. ఇక.. ఇదే సిరీస్​కు సంబంధించిన సెకండ్​ పార్ట్​లో సమంత నటిస్తోంది. వరుణ్​ ధవన్​తో కలిసి ఫుల్​గా రొమాన్స్​ చేసినట్టు తెలుస్తోంది. ఇక.. ఈ సిరీస్​తో సమంత తన అభిమానులకు కనువిందు చేయనున్నట్టు తెలుస్తోంది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

స్పై ఓరియంటెడ్​ వెబ్​ సిరీస్​లో వరుణ్​ ధవన్​తో సమంత రొమాన్స్​ చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సిరీస్​లో నటిస్తున్న విషయాన్ని సమంత తెలిపింది. దీనికి సంబంధించిన కొన్ని విషయాలను తన ఇన్​స్టాలో షేర్​ చేసింది. అంతేకాకుండా నటుడు వరుణ్ ధావన్​తో కలిసి ఇందులో సమంత హాట్​ హాట్​గా కనిపించనున్నట్టు సమాచారం. ఇప్పటికే సిటాడెల్​లో వరల్డ్​ ఫేమస్​ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించింది. బోల్డ్​ సీన్స్​తో తన అభిమానులను ఆకట్టుకుంది. స్పై ఓరియంటెడ్​​ సిరీస్​ అయిన సిటాడెల్​ ఫస్ట్​ సీజన్​ పూర్తి కావడంతో ఇక రెండో సీజన్​లో సమంత యాక్ట్​ చేసినట్టు సమాచారం.

ఇక.. ప్రైమ్ వీడియో వారి సిరీస్ ‘సిటాడెల్’ కి చెందిన ఇండియా సిరీస్​కు సంబంధించిన పార్ట్​లో సెర్బియా షెడ్యూల్‌ని పూర్తి చేసినట్టు సమంత, వరుణ్​ తెలిపారు. లోకల్ ఒరిజినల్ స్పై సిరీస్ గా చెప్పుకుంటున్న ఈ సిరిస్​ ప్రస్తుతం పేరు పెట్టని ప్రాజెక్ట్ గానే ప్రైమ్ వీడియో తెలిపింది. హాలీవుడ్ ఫిల్మ్ మేకింగ్ ద్వయం రస్సో బ్రదర్స్ తో కలిసి ఏర్పాటుచేసిన ఓ ప్రొడక్షన్ బ్యానర్ లో సమంత వర్క్​ చేస్తున్నట్టు తెలిపింది.

- Advertisement -

గతంలో ‘ది ఫ్యామిలీ మ్యాన్’  ‘ఫర్జీ’లో సమంత నటించింది. ఇక.. ప్రైమ్ వీడియోస్​లో భాగంగా తనతో కలిసి పనిచేసిన రాజ్ నిడిమోరు, కృష్ణ డికె వంటి వారు రాబోయే షోలో షోరన్నర్‌లు, డైరెక్టర్లుగా పనిచేస్తున్నారు. సిటాడెల్​కి సంబంధించిన షెడ్యూల్ పూర్తయినట్లు ప్రకటించిన వరుణ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాజ్ & డికె, సహ నటుడు సాకిబ్ సలీమ్‌తో ఉన్న ఫొటోని షేర్​ చేశాడు. ఇది సెర్బియా అబ్బాయిలు, అమ్మాయిలతో కలిసి నటించినప్పటి ఫొటో అని ‘భెడియా’ స్టార్ ఈ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చాడు. సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌కి వీడ్కోలు పలుకుతూ సమంత కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో డెజర్ట్ ప్లేట్ కి సంబంధించిన ఓ స్నాప్‌ను పోస్ట్ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement