Tuesday, April 30, 2024

Lake Protection | వర్రకుంటను కాపాడాలి.. బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన

వర్రకుంటను కాపాడుకుందాం అని బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ఇవ్వాల (ఆదివారం) ఆంధ్రప్రభ దినపత్రికలో వచ్చిన ‘‘వర్రకుంట గాయబ్​”కథనంపై పలువురు స్పందించారు. తెలంగాణలో చెరువుల కబ్జా జరుగుతోందని, బీఆర్​ఎస్​ పార్టీ నేతలే దీనికి సూత్రధారులని ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన నిజాంపేట్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షుడు ఆకుల సతీష్, ఉపాధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగింది. మంత్రి కేటీఆర్​ స్పందించి కబ్జాకోరులకు శిక్ష పడేలా చేయాలని, చెరువును కాపాడి ఫెన్సింగ్​ వేయాలని, కబ్జా ప్రాంతంలో చేపట్టిన నిర్మాణాలను కూలదోయాలని డిమాండ్​ చేశారు.

– ఇంటర్​నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

మొదక్​, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని బొల్లారం గ్రామం, జిన్నారం మండలం, సంగారెడ్డి జిల్లాలోని వర్రకుంటను (Sy no:81,82,84) ఆక్రమించి విల్లాలు నిర్మిస్తున్నారు. 2.871 ఎకరాల స్థలంలో విస్తరించిన ఈ చెరువును లేకుండా చేశారు. దీన్ని HMDA లేక్ ప్రొటెక్షన్ కమిటీ 2014లోనే చెరువు ప్రైమరీ నోటిఫికేషన్ గా గుర్తించింది. ఈ చెరువు ఆరు నెలలుగా మట్టితో పూడ్చి వేయడమే కాకుండా, ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్లో అధికారం టిఆర్ఎస్ పార్టీ నాయకుల గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 84 విల్లాలకు నిర్మాణానికి అనుమతి పొంది.. నిర్మాణాలు చేపట్టారు. దీన్ని టి ఎస్ బి పాస్ ద్వారా హెచ్ఎండిఏ (005547/LO/HMDA/1072/MED/2022) నుంచి అనుమతులు పొందడం ఎలా సాధ్యమైంది. అని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో చెరువులన్నీ లేకుండా పోతున్నాయని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, లీడర్లే వీటిని దిగమింగేస్తున్నారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ సర్వే నెంబర్ 82 లో ప్రైవేట్ భూములు చూపిస్తూ 29,672Sq.mt విస్తీర్ణంలో అనుమతులు పొందడం ఎలా సాధ్యమైందని ప్రశ్నిస్తున్నారు. కానీ, హెచ్ఎండిఏ ఇచ్చిన అనుమతి ఉత్తర్వుల నందు సర్వే నెంబర్​ను కూడా పేర్కొనకపోవడం అనుమానాలకు తావిస్తోందని బీజేపీ నేతలు అంటున్నారు. గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్టుక.. చెరువు ఉన్న కూడా చూపించకపోవడం, బాచుపల్లి ఎల్లమ్మ చెరువు( id) వచ్చే నాలను దిశా కూడా మార్చడం జరిగిందని మండిపడుతున్నారు.

- Advertisement -

ధరణి సర్వే నెంబర్లు, HMDA సర్వే నెంబర్లు వేరువేరుగా ఉండడం కూడా గ్రేటర్ ఇన్ఫ్రా వారికి మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, హెచ్ఎండిఏ అధికారులను చాలా తేలికగా మేనేజ్ చేసి అనుమతులు పొందినట్టు చెబుతున్నారు.. హెచ్ఎండిఏ ప్రైమరీ నోటిఫికేషన్ ప్రకారం వర్రకుంట ఎఫ్​టీఎల్​పాయింట్స్ అన్ని గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్టులోనే వచ్చాయి. ఇరిగేషన్ అధికారులు గ్రేటర్ ఇన్ఫ్రా చెరువు మొత్తం ఆక్రమించుకొని, ఆక్రమ నిర్మాణ అనుమతులు పొందడమే కాకుండా, నిర్మాణ పనులు జరుగుతున్న చెరువును రక్షించడానికి ఎందుకు చర్యలు తీసుకోలేదని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

రెవెన్యూ అధికారులు చెరువు స్థలంలో ఏ విధంగా నిర్మాణ అనుమతులు,NOC ఇచ్చినారని బీజేపీ నేతలు ఫైర్​ అవుతున్నారు. బొల్లారం మున్సిపల్  అధికారులు మాస్టర్ ప్లాన్ పరిశీలించకుండానే, లోకల్ బాడీ అనుమతులు ఎలా ఇచ్చారని దీనికి ఎంత పెద్ద మొత్తంలో ముడుపులు పుచ్చుకున్నారని ఆరోపిస్తున్నారు. హెచ్ఎండిఏ అధికారులు  సైట్ విజిట్ రిపోర్టులో చెరువునేందుకు గుర్తించలేదన్న విషయాన్ని లేవనెత్తుతున్నారు. మాస్టర్ ప్లాన్ లో, రెవెన్యూ రికార్డులు పరిశీలించకుండానే ఇలా అనుమతులు ఇచ్చారా? హెచ్ఎండిఏ ఇచ్చిన నిర్మాణ అనుమతుల ఉత్తర్వులలో ఎలాంటి సర్వేనెంబర్ పేర్కొనకపోవడం చూస్తే గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్టు కు ప్రత్యక్షంగా, పరోక్షంగా అక్రమా అనుమతులు నిర్మాణానికి సహకరించారన్న అర్థమవుతోందని బీజేపీ ఆరోపిస్తోంది.. వర్రకుంట చెరువులను పరిరక్షించాల్సిన ఇరిగేషన్ అధికారులే చెరువులు ఆక్రమణ ,అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా ప్రత్యక్షంగా సహకరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

దీనికి శేర్లింగంపల్లి ఎమ్మెల్యే బంధువు నెక్కంటి శ్రీనివాస్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ గ్రేటర్ ఇన్ఫ్రా కంపెనీలో డైరెక్టర్ గా ఉండడం వల్లనే చెరువు కబ్జా కి సహకరించి, అధికారులు అనుమతులు ఇవ్వడమే కాకుండా ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించారని తెలుస్తోందన్నారు. ఇప్పటికైనా మున్సిపల్ మంత్రి కేటీఆర్ స్పందించాలని, వారి పార్టీకి సంబంధించిన ప్రజా ప్రతినిధులు చెరువులు కబ్జా పెట్టి, అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకొని చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరుతున్నారు. తక్షణమే చెరువు స్థలాన్ని సర్వే చేసి గుర్తించి, అక్రమ అనుమతులను రద్దు చేయాలని,చెరువులో అక్రమ నిర్మాణాన్ని కూల్చడమే కాకుండా చెరువును ఆక్రమించుకున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్​ చేస్తున్నారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనికి ఇవ్వాల (ఆదివారం) నిజాంపేట్​లో ఆందోళన నిర్వహించారు. చెరువు సరిహద్దులు గుర్తించి పెన్సింగ్ వేసి రక్షించాలని  నిజాంపేట్ కార్పొరేషన్ బిజెపి అధ్యక్షుడు ఆకుల సతీష్, ఉపాధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ , సెక్రటరీ ప్రసాద్ , అరుణ్ రావు, బిజెపి సీనియర్​ నాయకులు కుమార్ గౌడ్, మురళి, కౌశిక్ ,శేషారావు , ప్రసాద్ రాజుతో పాటు వివిధ కాలనీలో ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement