Thursday, May 16, 2024

ఇండియ‌న్ ఐడ‌ల్ విన్న‌ర్ గా వాగ్దేవి- మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా బ‌హుమ‌తి

ప్ర‌ముఖ సింగ‌ర్ శ్రీ రామ‌చంద్ర హోస్ట్ గా చేస్తున్న ఇండియ‌న్ ఐడ‌ల్ చివ‌రి ద‌శ‌కి చేరుకుంది. ఈ షోని ఆహా సంస్థ రియాలిటీ నిర్వ‌హించి.. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న టాలెంటెండ్ సింగ‌ర్స్‌కు గొప్ప అవ‌కాశాన్ని క‌ల్పించింది. ఈ షోలో సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్‌, న‌టి నిత్యామీన‌న్, సింగ‌ర్ కార్తిక్‌లు జ‌డ్జ్‌లుగా వ్య‌వహ‌రించారు. తాజాగా ఈ షో తుది ద‌శ‌కు చేరుకుంది. వాగ్దేవి, వైష్ణ‌వి, ప్ర‌ణ‌తి, జ‌యంత్‌, శ్రీనివాస్‌లు ఫైన‌ల్‌కు రాగా.. వీళ్ళ‌లో ఎవ‌రు మొద‌టి తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ టైటిల్ విజేతగా నిలుస్తారు అన్న సస్పెన్స్‌కు తెర‌ప‌డింది. ఈ ఫినాలే ఎపిసోడ్‌కి మెగాస్టార్ చిరంజీవి గెస్ట్‌గా వ‌చ్చి కంటెస్టెంట్‌ల‌ను త‌నదైన శైలిలో ప్ర‌శంసిస్తూ ఈ ఎపిసోడ్‌కు క‌ళ తీసుకొచ్చారు. చిరంజీవితో పాటుగా రానా, సాయిప‌ల్ల‌విలు ‘విరాట‌ప‌ర్వం’ ప్ర‌మోషన్‌లో భాగంగా ఎపిసోడ్‌కి వ‌చ్చి సంద‌డి చేశారు. ఉత్కంఠ భ‌రితంగా సాగిన‌ ఈ ఫినాలే ఎపిసోడ్‌లో వాగ్ధేవి విజేత‌గా నిలిచింది. మెగాస్టార్ చేతుల మీదుగా ట్రోఫీని అందుకుని మొదటి తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్‌గా నిలిచింది. ట్రోఫీతో పాటు వాగ్దేవికి రూ.10 ల‌క్ష‌ల బ‌హుమానం, గీతా ఆర్ట్స్ నుండి రానున్న సినిమాలో పాట పాడే అవ‌కాశం కూడా వ‌చ్చింది. మొద‌టి ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన శ్రీనివాస్‌కు 3 ల‌క్ష‌లు, రెండ‌వ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన వైష్ణ‌వికి 2 ల‌క్ష‌ల బ‌హుమానం ఇచ్చారు. అంతేకాకుండా చిరంజీవి త‌న త‌దుప‌రి సినిమా ‘గాడ్‌ఫాద‌ర్‌’లో వైష్ణ‌వికి పాట పాడే అవ‌కాశం ఇచ్చారు. సింగ‌ర్ కార్తిక్ త‌ను సంగీతం అందించనున్న నెక్స్ట్ సినిమాలో వాగ్దేవికి ఛాన్స్ ఇస్తున్న‌ట్లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా వాగ్దేవి త‌న సంతోషాన్ని..ఆనందాన్ని వ్య‌క్తం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement