Thursday, April 25, 2024

వ్యాక్సిన్ తీసుకోని వారికోసం లాక్ డౌన్ ..ఎక్క‌డో తెలుసా..

మ‌ళ్లీ క‌రోనా కొన్ని దేశాల్లో పెరుగుతోంది. యూర‌ప్ లోని ఆస్ట్రియాలో కూడా క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా 10 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్టు ఆస్ట్రియా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ లాక్ డౌన్ అందరికీ కాదు. కేవలం వ్యాక్సిన్ తీసుకోని వారికి మాత్రమే వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. వ్యాక్సిన్ తీసుకోని వారు బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆ దేశంలో ఇప్పటి వరకు కేవలం 65 శాతం మాత్రమే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement