Saturday, May 4, 2024

రష్యాలో జంతువులకు వ్యాక్సినేషన్

ప్రపంచంలోనే తొలిసారి రష్యాలో జంతువులకు వ్యాక్సినేషన్‌ ప్రారంభమైంది. పెంపుడు జంతువులకు వ్యాక్సిన్‌ గురువారం రష్యా ప్రారంభించింది. రష్యా వెటర్నరీ విభాగం 17 వేల డోసులతో జంతువులకు వ్యాక్సిన్‌ వేయడం మొదలుపెట్టింది. మహమ్మారి కరోనా వైరస్‌ రాకుండా వ్యాక్సిన్‌ ప్రక్రియ ప్రపంచ దేశాల్లో ముమ్మరంగా సాగుతోంది. అయితే ఇన్నాళ్లు మానవులకు వేస్తుండగా ఇప్పుడు జంతువులకు వేయడం ప్రారంభించారు. జంతువుల కోసం రూపొందించిన వ్యాక్సిన్‌ ‘కార్నివాక్‌ కోవ్‌’. ఈ టీకా జంతువులకు ఆరు నెలల వరకు రక్షణ ఉంటుందని ఆ దేశ వెటర్నరీ విభాగం తెలిపింది. పై వ్యాక్సిన్‌ కుక్కలు, పిల్లులు, నక్కలపై ప్రయోగించగా సత్ఫలితాలు వచ్చాయి. దీంతో జంతువులకు వ్యాక్సిన్‌ను రష్యా ప్రారంభించింది. ప్రస్తుతం జంతువుల వ్యాక్సిన్‌కు కూడా భారీగా డిమాండ్‌ ఉంది. అయితే ఆ దేశంలో ఉత్పత్తి సామర్థ్యం 30 లక్షలు ఉండగా 50 లక్షలకు పెంచుతామని ఆ వెటర్నరీ అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement