Tuesday, May 7, 2024

Spl Story | కేరళపై విష ప్రచారం.. బీజేపీ పాలిత రాష్ట్రాలకంటే బెస్ట్​, అసలు వాస్తవాలు ఇవే!

కేరళపై విషపు ప్రచారం మొదలయ్యింది. దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలన్న బీజేపీ వ్యూహంలో భాగంగా ఈ సినిమాని ప్రొజెక్ట్​ చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే కేరళ ఇతర రాష్ట్రాలకంటే ప్రగతిశీల రాష్ట్రంగా ఉంది. ఎడ్యుకేషన్​లోనూ, ఆదాయంలోనూ, శిశు మరణాల విషయంలోనూ.. ఏ ఇతర రంగాలను పరిశీలించినా కేరళ ది బెస్ట్​గా ఉంటుంది.. కానీ, కేరళలో ఏదో జరిగిందనే విషపు ప్రచారంతో ఆ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయాలనే కుట్రతో ఈ వివాదాన్ని రాజేశారన్నది స్పష్టవుతోంది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

దేశంలోని దక్షిణాది రాష్ట్రమైన కేరళ ప్రస్తుతం అనేక వివాదాస్పద వాదనల్లో చిక్కుకుంది. ఇదంతా ‘ది కేరళ స్టోరీ’ సినిమా కారణంగా వార్తల్లోని ముఖ్యాంశాలలో చేరింది. ఏది ఏమైనప్పటికీ వాస్తవాలలో పాతుకుపోయిన మరో విషయం ఏంటంటే.. ‘కేరళ కథ’ ప్రకారం.. ఆ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకంటే అధిక అక్షరాస్యత రేటు కలిగి ఉంది. ప్రగతిశీల దృక్పథం.. సామాజిక విలువలకు ప్రసిద్ధి చెందింది.

అంతేకాకుండా ఈ మధ్య కాలంలో కేరళ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు నాన్-రెసిడెంట్ కేరళీయుల (NRKలు) పెద్ద ఎత్తున సహకరిస్తున్నారు.  ఇక.. నాన్-రెసిడెంట్ కేరళీయులు మొత్తం NRI రెమిటెన్స్ లలో 34 శాతం సహకరిస్తున్నట్టు తెలుస్తోంది. 2020లో NRK రెమిటెన్స్ లు 2.3 లక్షల కోట్లుగా ఉన్నాయి..  ఇది మొత్తం NRI రెమిటెన్స్ లలో 34 శాతం.

ఇక.. కేరళ తలసరి ఆదాయం దేశంలోని మిగిలిన ప్రాంతాల కంటే 60 శాతం ఎక్కువ. కేరళీయులలో 0.71 శాతం మాత్రమే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. అయితే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న దాంట్లో జాతీయ సగటు 22 శాతం. కాగా, కేరళ అక్షరాస్యత రేటు 96 శాతం. ఇది జాతీయ సగటు 77 శాతం కంటే చాలా ఎక్కువ. అంతేకాకుండా.. కేరళలో శిశు మరణాల రేటు చాలా తక్కువ.. ఇది కేవలం 6శాతంగానే ఉంది. ఇది అస్సాం, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే చాలా చాలా తక్కువ.

- Advertisement -

‘ది కేరళ స్టోరీ’ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకున్నారంటే..

ఈమధ్యనే విడుదలై వివాదాస్పదంగా మారిన “ది కేరళ స్టోరీ” అనే చిత్రం ఆ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా ఉంది. ఇందులో కేరళ మహిళలు బలవంతంగా ఇస్లాం మతంలోకి మారి ఐసిస్‌లో చేరారని ఆ సినిమాలో చూపించారు. 32,000 మంది కేరళ మహిళలు బలవంతంగా ఇస్లాం మతంలోకి మారారని, ఆ తర్వాత ISISలో చేరినట్లు సినిమా ట్రైలర్ లో వెల్లడించారు. అయితే.. ఈ వాదనపై వివాదం చెలరేగడంతో ఆ సంఖ్య కాస్త ముగ్గురు మహిళలకు చేరింది. సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుండి.. ‘ది కేరళ స్టోరీ’ లోని మతపరమైన కంటెంట్ కారణంగా పెద్ద ఎత్తు వార్తల్లో ఉంది.

కాగా, అదా శర్మ నటించిన ఈ చిత్రం 32,000 మంది మహిళలు రాష్ట్రాన్ని విడిచిపెట్టినట్లు పేర్కొనడం పెద్ద వివాదాన్ని సృష్టించింది. దీంతో ఈ సినిమా ప్రదర్శనపై నిషేధం విధించాలని కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. చలనచిత్రానికి సంబంధించిన రివ్వూలు కూడా చాలా ప్రతికూలంగా ఉన్నాయి. విమర్శకులు ఈ సినిమాని చీల్చి చెండాడారు. ఇదంతా మతం కోణంలో వక్రీకరించి తీశారని, అంతా మెలోడ్రామాటిక్ గా ఉందని, మానిప్యులేటివ్ చేశారని, మతం పేరుతో భయంకరంగా తీశారని, ఇదో నయ వంచనతో, పూర్తి అబద్ధాలతో సినిమా తీశారని విశ్లేషించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement