Sunday, May 5, 2024

ఈ అబ్బాయిని గుర్తుప‌ట్టారా – ప్ర‌స్తుతం ఓ రాష్ట్రానికి సీఎం

ఫొటోలో క‌నిపిస్తోన్న ఈ బాలుడిని గుర్తుప‌ట్టారా. ఈ అబ్బాయి ఓ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి. ఆయ‌నే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్. కాగా ఆయ‌న చిన్న‌నాటి ఫొటోని ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశారు కేంద్ర‌మంత్రి హ‌ర్ దీప్ సింగ్ పూరి. కాగా ఈ ఫొటోలో చిన్న‌నాటి యోగి కుర్చిలో కూర్చుని చిరునవ్వులు చిందిస్తూ క‌నిపిస్తున్నాడు. చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన సాధారణ అబ్బాయి. పాత బట్టలు, కాళ్లకు చెప్పులు ధరించి ఉన్నారు.. కానీ మనసులో ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం ఉంది. గౌరవనీయులైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చిన్ననాటి ఫొటో ఇది’ అని కేంద్ర మంత్రి ప్ర‌శంస‌లు కురిపించారు. యోగి ఆదిత్యనాథ్ పౌరీ గర్వాల్‌లోని పంచూర్ గ్రామంలో జన్మించారు. ఇది ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో ఉంది. ఆయన తల్లిదండ్రులు ఆనంద సింగ్‌ బిస్త్‌- సావిత్రి. ఉత్తరాఖండ్‌లోని గర్వాల్‌ యూనివర్సిటీ నుంచి యోగి.. సైన్స్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన చేశారు.

అనంతరం మహంత్‌ అవైద్యనాథ్‌ దృష్టిని ఆకర్షించిన యోగి… అంచెలంచెలుగా ఎదిగి 1994లో గోరఖ్‌పూర్‌ మఠ ప్రధాన అర్చకులుగా నియమితులయ్యారు. మహంత్‌ అవైద్యనాథ్‌ మరణానంతరం 2014లో గోరఖ్‌పూర్‌ పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. లోక్‌సభలో గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన మహంత్ వైద్యనాథ్ రాజకీయ వారసుడిగా కూడా యోగి ఆదిత్యనాథ్ నిలిచారు. ఆయన తర్వాత యోగి అదే స్థానం నుంచి పోటీ చేసి 2014 వరకు ఐదుసార్లు గెలిచారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఉ‍త్తరప్రదేశ్‌లో బీజేపీ మెజారిటీ స్థానాలు గెలుపొందడంలో యోగి కీలక పాత్ర పోషించారు. అదే జోరుతో 2017లో యూపీలో బీజేపీ అధికారం చేపట్టింది. అదే ఏడాది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమితులైన తర్వాత ఆయన గోరఖ్‌పూర్ ఎంపీగా రాజీనామా చేయాల్సి వచ్చింది. మరికొద్ది రోజుల్లో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ పోటీ చేయనున్నారు. యోగి.. అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవడం ఇదే తొలిసారి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement