Friday, May 17, 2024

రష్యా దాడిపై ఐక్యరాజ్యసమితి తీర్మానం.. ఓటింగ్ కు భారత్, చైనా దూరం!

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆపాలని ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసింది. ఉక్రెయిన్ నుండి తన సైనిక బలగాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రపంచ దేశాలలో చాలా వరకు ఐక్యరాజ్యసమితి తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసింది. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ అత్యవసర సమావేశంలో బుధవారం ఈ తీర్మానాన్ని ఆమోదించారు.

ఉక్రెయిన్‌ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని సమర్ధిస్తూ చేసిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం (UNGA) ఆమోదించింది. అమెరికా, బ్రిటన్‌, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, అఫ్గానిస్థాన్‌, ఐర్లాండ్‌ సహా 141 సభ్య దేశాలు తీర్మానానికి అనుకూలంగా ఓటువేశాయి. దీనిని ఐదు దేశాలు వ్యతిరేకించాయి. ఎరిట్రియా, ఉత్తర కొరియా, సిరియా, బెలారస్ వ్యతిరేకంగా ఓటు వేశాయి. అయితే, ఈ ఓటింగ్‌కు చైనా, భారత్, దక్షిణాఫ్రికా దేశాలు దూరంగా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement