Monday, April 29, 2024

UP Elections: యూపీలో ఆరో విడత పోలింగ్.. బరిలో సీఎం యోగి

ఉత్తరప్రదేశ్ లో ఆరవ విడత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం 7 గంటలకు పొలింగ్ ప్రారంభమైంది. నేడు 10 జిల్లాల్లో 57 సీట్లు ఇవాళ10 జిల్లాల్లో 57 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 678 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, కాంగ్రెస్‌ నేత అజయ్‌ కుమార్‌ లల్లూ, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన స్వామి ప్రసాద్‌ మౌర్య సహా రాజకీయ ప్రముఖుల ఈ విడత ఎన్నికల్లో బరిలో నిలిచారు. అంబేద్కర్ నగర్, బలరాంపూర్, సిధ్దార్ద్ నగర్, బస్తి, సంత్ కబీర్ నగర్, మహరాజ్ గంజ్, గోరఖ్ పూర్, డియోరియా, కుషీ నగర్, బల్లియా జిల్లాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. గోరఖ్ పూర్ లోకసభ స్థానం నుంచి 5 సార్లు ఎంపీగా గెలిచిన సీఎం యోగి ఆదిత్యనాధ్.. ఈ సారి గోరఖ్ పూర్ అర్బన్ అసెంబ్లీ స్థానం నుంచి తొలిసారిగా పోటీలో చేస్తున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానం నుంచి బిజేపి అభ్యర్థిగా రాధా మోహన్ దాసు అగర్వాల్ 60 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

కగా, 2017 ఎన్నికల్లో 57 స్థానాల్లో 46 స్థానాల్లో బిజేపి గెలిచింది. ఏడవ విడతలో మార్చి 7 న మిగిలిన 54 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటివరకు 292 స్థానాల్లో ఎన్నికలు పూర్తి అవుతాయి. ఈ నెల 10న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.  

Advertisement

తాజా వార్తలు

Advertisement