Monday, May 6, 2024

Ukraine-Russia crisis: రంగంలో దిగిన అమెరికా.. మూడో ప్రపంచ యుద్ధం తప్పదా?

రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని రష్యా, ఉక్రెయిన్‌ స్థితిగతులపై అపార అవగాహన ఉన్న మాజీ దౌత్యవేత్త డాక్టర్‌ టి.సురేష్‌బాబు అభిప్రాయపడ్డారు. పటిష్ఠమైన సైనిక బలగం, అపార అణ్వాయుధ సంపత్తి కలిగిన రష్యాతో యుద్ధానికి దిగితే తీవ్ర పరిణామాలకు దారి తీసేదని.. అందుకే కఠిన ఆర్థిక ఆంక్షలు విధించడానికే అమెరికా సహా నాటో దేశాలు పరిమితమయ్యాయని తెలిపారు. యుద్ధం మొదలైన రెండోరోజే ఉక్రెయిన్​లోని కీలక స్థావరాలను రష్యా చేజిక్కించుకోవటాన్ని చూస్తే.. ఆ దేశం ముందు నుంచే యుద్ధానికి సన్నద్ధమైనట్లుగా తెలుస్తోందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement