Saturday, May 18, 2024

ఖమ్మం స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడిగా బచ్చు విజయ్ కుమార్

-ఖమ్మం స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షునిగా ఖమ్మం సుడా చైర్మన్,టిఆర్ఎస్ జిల్లా నాయకుడు బచ్చు విజయ్ కుమార్ ఎన్నికయ్యారు. ఆయనతో పాటు స్పోర్ట్స్ క్లబ్ కార్యదర్శిగా ఎం.వి.రమణ, నిర్వహణ కార్యదర్శిగా ఓలేటి సాంబ మూర్తిలను ఎన్నుకున్నారు. శుక్రవారం సాయంత్రం పెవిలియన్ గ్రౌండ్ లో జరిగిన క్రీడాకారుల స్పోర్ట్స్ క్లబ్ సభ్యుల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో వీరిని ఎన్నుకున్నారు.

అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి బచ్చు విజయ్ కుమార్ మాట్లాడారు. ఖమ్మం నగరంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహకారంతో క్రీడా అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వం నుండి క్రీడల అభివృద్ధి కొరకు నిధులను కేటాయించేలా కృషి చేస్తానని, క్రీడాకారులకు అవసరమైన ఏర్పాట్లను చేయడంలో ముందుంటానని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించబోతున్నారని తెలిపారు. ఖమ్మంలో పటేల్ స్టేడియంలో పెవిలియన్ గ్రౌండ్లో, ఇతర ప్రభుత్వ కళాశాల గ్రౌండ్లో క్రీడాకారులకు మంచి నీటి సౌకర్యం, క్రీడా పరికరాలు అందించడంలో మంత్రి పువ్వాడ అగ్రభాగంగా నిలిచారని ఆయన మార్గదర్శకంలో క్రీడా అభివృద్ధి జరుగుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement