Monday, April 29, 2024

ఉద‌య‌భాను రీ ఎంట్రీ – త‌గ్గేదే లే

ఇప్పుడు స్టార్ యాంక‌ర్ ఎవ‌రు అంటే సుమ క‌న‌కాల పేరు చెబుతాం. కానీ అప్ప‌ట్లో యాంక‌ర్ ఉద‌య‌భాను అంటే తెలియ‌నివారు ఉండ‌క‌పోవ‌చ్చు. బుల్లితెర‌పై మెర‌వ‌డ‌మే కాదు, ప‌లు చిత్రాల్లో కూడా న‌టించింది. ఒకప్పుడు తెలుగులో స్టార్ యాంకర్ అంటే ఉదయ భాను మాత్రమే కనిపించేది. ఆమె కనిపిస్తే చాలు కుర్ర కారు ఉర్రూతలూగేవారు. అప్పట్లోనే హాట్ హాట్ గా స్పైసీ గా డ్రెస్ లు వేసుకుంటూ యాంకరింగ్ చేసి.. షోస్ ను తన ఇమేజ్ తో సక్సెస్ చేసేది ఉదయ భాను. ఇప్పుడంటే మనం స్టార్ యాంకర్ గా సుమను ఆకాశానికి ఎత్తుతున్నాం కాని.. ఒకప్పుడు బుల్లి తెరను ఏలియన మహారాణి మాత్రం ఉదయభానునే. స్మాల్ స్క్రీన్ కు గ్లామర్ షో అద్దిన ఉదయ భాను కోసమే షోలను చూసేవారు అంటే ఆమె ఎంత పాపులారిటీ సంపాధించుకుందో తెలుస్తుంది.

రానా హీరోగా అరంగ్రేటం చేసిన చిత్రం లీడ‌ర్ లో ఐటెం సాంగ్ లో కూడా మెరిసింది. కాగా వివాహనంత‌రం ఉద‌య‌భాను హ‌వా త‌గ్గింది. మ‌ళ్ళీ ఉద‌య‌భాను రీ ఎంట్రీ ఇచ్చింది. ప‌లు ఈవెంట్స్ ల‌లో మెరిసింది ఉద‌య‌భాను. రీసెంట్ గా రిలీజ్ అయిన అఖండ అఖండ సినిమా సక్సెస్ ఇంటర్వ్యూ చేసి అందరి దృష్టి తనపై పడేలా చేసింది. ఈ చిత్రంలో బాల‌కృష్ణ న‌టించిన సంగ‌తి తెలిసిందే. కాగా హీరో నాని నటించిన శ్యామ్‌ సింగరాయ్ టీమ్‌తో కూడా స్పెషల్ చిట్‌చాట్ చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఇక తిరుపతిలో జరిగిన పుష్ప సినిమా సక్సెస్ మీట్ కూడా ఉదయభాను యాంకరింగ్ చేసింది. వయస్సు పెరిగినా క్రేజ్ మాత్రం తగ్గదు అని ఈమె స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ప్రేక్షకుల అరుపులు చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికీ ఈమె సరిగ్గా కాన్స‌న్‌ట్రేట్ చేస్తే బిజీ అవుతుంద‌ని అంటున్నారు ఉద‌య‌భాను అభిమానులు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement