Sunday, April 28, 2024

సీఎం కేసీఆర్‌పై తప్పుడు ప్రచారం.. ఇద్దరి అరెస్ట్

కొన్నిరోజుల కిందట కరోనా వైరస్ బారిన పడ్డ తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినందుకు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఒకరు ఇంటర్ విద్యార్థి కావడం గమనార్హం. నల్లగొండ జిల్లా మునుగోడు మండలానికి ఓ ఇంటర్‌ విద్యార్థి(16) ఈ నెల 17న సీఎం కేసీఆర్‌ ఆరోగ్యంపై ఓ తప్పుడు సందేశాన్ని వాట్సాప్‌ గ్రూపులో షేర్‌ చేశాడు. తీన్మార్ మల్లన్న యువసేన వాట్సాప్ గ్రూప్ సభ్యుడిగా ఉన్న భీమనపల్లి శేఖర్‌ అనే టీనేజర్ ఆ సందేశాన్ని పలు గ్రూపుల్లో షేర్‌ చేశాడు. వీరి తప్పుడు సందేశం వైరల్‌ అవుతుండటంతో హైదరాబాద్ సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం కరోనా వల్ల ప్రజలందరూ భయపడుతున్న తరుణంలో సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రసారం చేయడం ద్వారా నిందితులు మరింత భయాందోళనలను సృష్టించారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితులను ఇన్‌స్పెక్టర్ కె.నాగేశ్వరరావు నేతృత్వంలో హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ కమిషనర్ బృందం అదుపులోకి తీసుకుంది. అంతేకాకుండా నిందితుల నుంచి రెండు మొబైల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితుల్లో ఉన్న ఇంటర్ విద్యార్థి హైదరాబాద్ వనస్థలిపురంలోని ఓ హాస్టల్‌లో ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement