Wednesday, May 15, 2024

అర్ధరాత్రి బల్మూరి వెంకట్ అరెస్ట్.. జమ్మికుంట స్టేషన్ లో NSUI నేత

కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా(NSUI) తెలంగాణ అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ని కరీంనగర్ జిల్లా జమ్మికుంట పోలీసులు గురువారం అర్దరాత్రి అదపులోకి తీసుకున్నారు. కరీంనగర్ పట్టణంలోని శాతవాహన యూనివర్సిటీ వద్ద కేసిఆర్ పుట్టిన రోజు సందర్భంగా వెంకట్ బల్మూర్ ఆధ్వర్యంలో గాడిదకు కేసిఆర్ చిత్ర పటాన్ని వేసి సీఎం జన్మదిన వేడుకలను నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం అర్థరాత్రి వెంకట్ తన హుజురాబాద్ నియోజకవర్గ సమావేశాలను ముగించుకొని హుజురాబాద్ లోని తన నివాసానికి తిరిగి వెళ్తుండగా జమ్మికుంట పోలీసులు మార్గ మధ్యంలో వెంకట్ ను అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.  

కెసిఆర్ చిత్ర పటంలో గాడిదతో జనమదిన వేడుకలను నిర్వహించిన విషయంలో తెరాస నాయకులు  జమ్మికుంట పోలీస్ స్టేషన్ లో తన పై కంప్లైంట్ నమోదు చేశారని పోలీసులు తెలిపారు. విచారణ నిమిత్తం హుజురాబాద్ నుండి జమ్మికుంట పోలీస్ స్టేషన్ కి తరలించామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement