Tuesday, May 7, 2024

ఆర్ ఆర్ ఆర్ చిత్ర టీం కి టీఎస్ ఆర్టీసీ స్పెష‌ల్ బ‌స్సు – స‌జ్జ‌నార్ కి థ్యాంక్స్

ఆర్ ఆర్ ఆర్ చిత్ర టీంకి టీఎస్ ఆర్టీసి స్పెష‌ల్ బ‌స్సును ఏర్పాటు చేసింది . ఈ మేర‌కు స‌జ్జ‌నార్ కి ఈ చిత్ర బృందం థ్యాంక్స్ చెప్పింది.ప్రీమియర్ షో మొదలైనప్పట్నుంచి ‘ఆర్ఆర్ఆర్’టీం మొత్తం బస్సుల్లోనే థియేటర్లకు వెళ్లింది. డైరెక్టర్ రాజమౌళి, హీరో రామ్ చరణ్, ఆర్ఆర్ఆర్ యూనిట్ లోని పలువురు ప్రముఖులు బస్సులో థియేటర్ కు చేరుకున్నారు. కాగా, స్పెషల్ బస్సు వేయడంపై ఆర్టీసీకి ‘ఆర్ఆర్ఆర్’ టీం కృతజ్ఞతలు తెలిపింది. అంతేగాకుండా సినిమా చూసేందుకు ప్రత్యేక బస్సులు వేస్తున్నందుకు ధన్యావాదాలు అని పేర్కొంది. ఆ వీడియో కాస్తా ఇప్పుడు వైరల్ అయిపోయింది. బస్సులో వచ్చిన చిత్ర బృందానికి అభిమానులు జెండాలు పట్టుకుని ఘన స్వాగతం పలికారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement