Friday, May 3, 2024

పార్లమెంట్ సమావేశాలు బహిష్కరించిన TRS.. వాట్ నెక్ట్స్?

పార్లమెంట్ శీతాకాల సమావేశాలను టీఆర్ఎస్ పార్టీ బహిష్కరించింది. 9 మంది లోక్ సభ సభ్యులు, ఏడుగురు రాజ్యసభ సభ్యులు ఉభయసభల నుంచి వాకౌట్ చేశారు. వరి ధాన్యం విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాని నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నారు. యార్డుల్లో ఉన్న ధాన్యాన్ని FCI తరలించకపోవడంతో ధాన్యం పాడైపోయే పరిస్థితి ఏర్పడిందని టీఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావు అన్నారు. రబీ ధాన్యం సేకరణలో కేంద్రం వివక్ష చూపడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. వారం రోజులుగా పార్లమెంట్ వేదికగా ఆందోళన చేస్తున్నామని చెప్పారు. తమ ఆందోళనలను కేంద్రం పట్టించుకోకపోవడం వల్లనే సమావేశాలను బహిష్కరించామని కేకే తెలిపారు. తదుపరి కార్యాచరణను త్వరలోనే ప్రకటస్తామని తెలిపారు.

అంతకుముందు.. లోక్ సభలో TRS ఎంపీలు వినూత్నంగా ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగంపై చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకతకు నిరసనగా ఎంపీలు నల్ల దుస్తులతో హాజరు అయ్యారు. రాజ్య సభ, లోక్ సభలలో ఎంపీల నిరసన తెలిపారు. కేంద్రం మొండి వైఖరి నశించాలంటూ.. వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత  ఇవ్వాలని ఫ్లకార్డుల ప్రదర్శించారు. రైతాంగం కోసం గత వారం రోజులుగా స్పీకర్ పోడియం దగ్గరికి వెళ్లి నినాదాలు చేస్తూ, నిరసన తెలిపారు. రైతులపై ఎక్కుపెట్టిన నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్న కేంద్రం, ధాన్యం కొనుగోళ్లపై స్పష్టతను ఇవ్వడం లేదని మండిపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement