Wednesday, May 8, 2024

ఈడీ ముందుకు టీఆర్ఎస్ ఎంపీ నామా.. రూ.264 కోట్ల స్కాంపై విచారణ

జార్ఖండ్‌లో మధుకాన్‌ కంపెనీ చేపట్టిన నేషనల్‌ హైవే ప్రాజెక్టు కోసం తీసుకున్న బ్యాంకు రుణాలను పక్కదారి పట్టించారని ఆరోపణలపై టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు ఇవాళ ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. మధుకాన్ కంపెనీ రూ. 264 కోట్ల స్కాం లో ఈడి నోటీసులు ఇచ్చింది. నేడు విచారణకు హాజరు కావాలని నామతో పాటు కంపెనీ డైరెక్టర్లకు ఈడి సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎంపీ నామా విచారణకు హాజరు కానున్నారు. ఈడీ విచారణకు తాను సహకరిస్తానని నామా ఇప్పటికే ప్రకటించారు.

జార్ఖండ్‌లో మధుకాన్‌ కంపెనీ చేపట్టిన నేషనల్‌ హైవే ప్రాజెక్టు కోసం తీసుకున్న బ్యాంకు రుణాలను పక్కదారి పట్టించారని టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. 2011లో జార్ఖండ్‌లో రాంచీ– జంషెడ్‌పూర్‌ మధ్య 163 కిలోమీటర్ల పొడవైన నేషనల్‌ హైవే పనులను మధుకాన్‌ కంపెనీ దక్కించుకుంది. రూ.1,151 కోట్ల వ్యయంతో బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్‌ పద్ధతిలో చేజిక్కించుకుంది. ఇందుకోసం స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ కింద రాంచీ ఎక్స్‌ప్రెస్‌ వే లిమిటెడ్‌ను ఏర్పాటు చేశారు. మధుకాన్‌ సంస్థ ప్రభుత్వం నుంచి దక్కించుకున్న టెండర్‌ను చూపించి.. కెనరా బ్యాంకు ఆధ్వర్యంలోని బ్యాంకుల కన్సార్షియం నుంచి రూ.1,029.39 కోట్లు పొందింది. తర్వాత మధుకాన్‌ సంస్థ అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో.. విచారించాలని  సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ (ఎస్‌ఎఫ్‌ఐఓ) న్యూఢిల్లీని  జార్ఖండ్‌ హైకోర్టు ఆదేశించింది. ఎస్‌ఎఫ్‌ఐఓ దర్యాప్తు చేసి.. మధుకాన్‌ తీసుకున్న రుణంలోంచి రూ.264.01 కోట్లు పక్కదారి పట్టినట్టు నివేదిక ఇచ్చింది. ఈ అంశంలో సీబీఐ కూడా దర్యాప్తు చేపట్టింది. 

మధుకాన్‌ గ్రూపుతోపాటు పలు ఇతర కంపెనీలపై  కేసు నమోదు చేసింది. ఈ కేసులో భారీగా నిధులు అక్రమంగా విదేశాలకు తరలించారన్న ఆరోపణలతో మనీల్యాండరింగ్‌  చట్టం కింద ఈడీ దర్యాప్తు ప్రారంభించింది.  అందులో భాగంగానే సీబీఐ అధికారులు నామా ఇంట్లో,కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఈ కేసుకు సంబంధించి నామా జూన్‌ 25న ఈడీ ఎదుట విచారణకు హాజరు కావాలిన ఈటీ నోటిసులు పంపిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: తెలంగాణలో ‘రైతు బంధు’ కోసం రూ.7,298 కోట్లు విడుదల

Advertisement

తాజా వార్తలు

Advertisement