Monday, April 29, 2024

గెలుపు జోష్: గన్ తో టీఆర్ఎస్ నేత హల్ చల్

తెలంగాణలో జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ గెలవడంతో ఆపార్టీ నాయకుల సంబరాలు శ్రుతిమించాయి. సంబరాల్లో పార్టీ కార్యకర్తలు అతి చేస్తున్నారు. టీఆర్ఎస్ నాయకుడు కట్టెల శ్రీనివాస్ తుపాకీతో హల్ చల్ చేశాడు. నిన్న తెలంగాణ భవన్ లో ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సవాల్లో పాల్గొన్న శ్రీనివాస్.. గన్తో కాల్పులు జరిపే ప్రయత్నం చేశాడు. అయితే పక్కనున్న వాళ్లు వారించడంతో గన్ లోపల పెట్టేశాడు. అయితే, దీనికి సంబంధించి ఎలాంటి కేసు నమోదు కాలేదు.

కాగా, దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పరాభవం తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడంతో గులాబీ శ్రేణుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. టీఆర్ఎస్ కార్యకర్తల అత్యుత్సాహం కారణంగా తెలంగాణ భవన్లో మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement