Sunday, April 28, 2024

కాస్త త‌గ్గిన బంగారం ధ‌ర‌.. స్థిరంగా వెండి

నేటి బంగారం ధ‌ర కాస్త త‌గ్గుముఖం ప‌ట్టింది..కాగా సిల్వ‌ర్ రేట్లు స్థిరంగా ఉన్నాయి.హైదరాబాద్‌లో బంగారం ధర వరుసగా రెండోరోజు తగ్గింది. ఇవాళ 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.30 మేర తగ్గి ప్రస్తుతం రూ.55 వేల 720 పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.30 తగ్గింది. ప్రస్తుతం రూ.60 వేల 790 మార్క్ వద్ద ఉంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో బంగారం రేటు 22 క్యారెట్ల గోల్డ్ తులానికి రూ.50 తగ్గి ప్రస్తుతం రూ.55 వేల 850 పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ ధర తులానికి రూ.30 తగ్గి ప్రస్తుతం రూ.60 వేల 940 మార్క్ వద్ద ఉంది. వెండి విషయానికి వస్తే క్రితం సెషన్‌లో కిలోకు రూ.900 తగ్గినప్పటికీ ఇవాళ ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రేటు కిలోకు రూ.80 వేల 400 పలుకుతోంది. మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర నిన్న రూ.700 తగ్గగా ఇవాళ స్థిరంగా ఉంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.76 వేల 900 పలుకుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement