Friday, May 3, 2024

నేడే భారతీయులకు 75వ స్వాతంత్ర్య దినోత్సవం

ప్రతి దేశానికి పరుల పాలన నుంచి విముక్తి లభించిన రోజును స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీ. దాదాపు 200 ఏళ్ల బ్రిటిష్ పాలనలో బానిసత్వాన్ని భారత దేశం చవిచూసింది. 1947, ఆగస్టు 15న మన దేశం ఈ బానిసత్వం నుండి విముక్తిని పొందింది. అప్పటి నుంచి ఆగస్టు 15న మనము స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ వేడుకలు జరుపుకునేందుకు వీలుగా.. ఆగస్టు 15 తేదీని జాతీయ సెలవు దినంగా పాటిస్తున్నాము. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి నేటితో 75 ఏళ్లు పూర్తవుతున్నాయి.

ఈ 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా.. ప్రధాని మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగుర వేయనున్నారు. ఎర్రకోట వద్ద మన సైనికులు చేసే సాహసాలు, విన్యాసాలు అబ్బురపరచనున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాలు ఆయా రాష్ట్రాల పురోగతిని ప్రతిబింబించనున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఎక్కువగా వ్యవసాయం, కళలకు సంబంధించిన శకటాలను ప్రదర్శించనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement