Friday, April 26, 2024

కాలం మారింది.. చిన్న విప‌త్తుకే ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతున్నాయి..

చరిత్రలో ఎన్నడూ లేనంతగా కూరగాయాల ధరలు పెరిగాయి. సీమాంధ్రలో వరదల కారణంగా ఆ ప్రాంతంలో పండే టమాటా దిగుబడి తగ్గింది. దాని కారణంగా టమాట కిలో రేటు వంద వరకు చేరింది అనుకుంటే పొరపాటు. టమాటతో పాటు మిగిలిన కూరగాయల ధరలు కూడా మండుతున్నాయి. చిక్కుడు కాయలు, బీర కాయలు, వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, ములక్కాయలు కూడా కిలో రూ.600 ధర పలకడం గమనార్హం. కిలోకు దాదాపు 20 ములక్కాయలు తూగుతాయి. అంటే ఒక్కో ములక్కాయ రూ.30 ఇచ్చి కొనుక్కోవాలి.

ఆఖరికి తోటకూర, గోంగూర వంటి ఆకుకూరల కూడా గతంలో కంటే రెట్టింపు ధర పలుకుతున్నాయి.10 రూపాయలకు మార్కెట్లో రెండు కట్టలు ఇచ్చే తోటకూర.. ఇప్పుడు ఒక్క కట్టే ఇస్తున్నారు. చిక్కుడు కాయలు కిలో రూ.55, దోసకాయలు రూ.50, బెండకాయలు రూ.45 ధర పలుకుతోంది. అసలే వంటనూనెల ధరలు, గ్యాస్‌ ధరలు పెరిగాయి.. ఎలా భగవంతుడా..? అనుకుంటున్న తరుణంలో కూరగాయాలు కూడా వాటికి జతకలిశాయి. పెరిగిన ధరలతో హోటళ్లు, మెస్‌ల్లోనూ రేట్లు పెంచాల్సి వచ్చింది.

ఒకప్పుడు పూర్తిస్థాయిలో గ్రామాల్లోనూ, పాక్షికంగా అయినా పట్టణాల్లోనూ ఇంటి సాగు ఉండేది. పెరట్లో కూరగాయలు మొక్కలు పెంచుకునే సంస్కృతి ఉండేది. టమాటాలతో పాటు బీరపాదు, పొట్లపాదు, ఆకుకూరలు కూడా పండించుకునేవారు. పట్టణీకరణతో పాటు అపార్టమెంట్‌ కల్చర్‌ వచ్చాక.. పూర్తిగా ఆ పరిస్థితి మారిపోయింది. కరివేపాకు కొనాలన్నా.. మార్కెట్‌కు వెళ్లాల్సి వచ్చేలా తయారైంది ప‌రిస్తితి. ఆఖరికి గ్రామాల్లోనూ ఇంటి సాగు కనుమరుగవుతోంది. మంచినీటితో పాటు పాలు, కూరగాయలు, పప్పులు ఇలా ఏవి కావాలన్నా కొనుగోలుపైనే దాదాపు గ్రామీణులు సైతం ఆధారపడుతున్నారు. దీంతో ప్రకృతి విపత్తులతో పంట నష్టపోతే కూరగాయలు ధరలు ఇలాగే ఆకాశన్నంటుతున్నాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement