Sunday, May 5, 2024

నేతాజీ అస్థికలను భారత్​కు తీసుకురావాలి.. సుభాష్​ చంద్రబోస్​ కూతురు అనితా డిమాండ్​

స్వాతంత్ర్య పోరాట వీరుడు.. ఆజాద్​ హింద్​ ఫౌజ్​ దళపతి​ అయిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అస్థికలను భారత్​కి తీసుకురావాలని అతని కుమార్తె అనితా బోస్‌ ఫాఫ్‌ అన్నారు. మరోసారి తన డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. దీనిపై భారత్‌, జపాన్‌ల మధ్య సందిగ్ధం నెలకొందని ఆమె పేర్కొన్నారు. నేతాజీ స్వాతంత్ర్యం అనుభవించడానికి జీవించి లేరు కావచ్చు.. కానీ,  అతని అవశేషాలను అయినా దేశానికి తిరిగి తీసుకురావడం కొంత సంతృప్తినిస్తుందని అనితా బోస్ అన్నారు.

భారత ప్రభుత్వం, జపాన్ ప్రభుత్వం రెండూ ఈ అంశంలో దాటవేత ధోరణితో ఉన్నాయని, నేతాజీ బోస్​ ప్రతష్ఠను మసకబార్చాలని చూస్తున్నాయని పేర్కొన్నారు. ఇది తమకు కొంచెం అసౌకర్యంగా ఉన్నట్లు భావిస్తున్నాన్నారు. నేతాజీ 1945 ఆగస్టు 18న తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయారని అందరూ విశ్వసిస్తున్నప్పటికీ, నేతాజీ మరణం ఓ మిస్టరీగా మిగిలిపోయింది.

అయితే.. ఆగష్టు 18, 1945న తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారని రెండు విచారణ కమిషన్లు నిర్ధారించగా.. జస్టిస్ MK ముఖర్జీ నేతృత్వంలోని మూడవ దర్యాప్తు ప్యానెల్ దాన్ని పూర్తిగా వ్యతిరేకించింది. ఆ తర్వాత బోస్ జీవించి ఉన్నాడని ఈ దర్యాప్తు బృందం సూచించడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement