Saturday, May 18, 2024

ఫిరాయింపుల నిరోధక చట్టంపై ఉపరాష్ట్రపతి అసంతృప్తి.. లొసుగులను సరిచేయాలన్న వెంకయ్యనాయుడు

ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లొసుగులపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు. దాన్ని మరింత ప్రభావవంతంగా మార్చేందుకు సవరణలు చేయాలని అన్నారు. ఒక కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. “ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని నిజంగా సవరించాల్సిన సమయం వచ్చిందని నేను భావిస్తున్నా. ఎందుకంటే కొన్ని లొసుగులు ఉన్నాయి. చట్టంలో స్పష్టత ఉండాలి. కాలక్రమం ఉండాలి. అది గరిష్టంగా ఆరు నెలల వరకు నిర్ణయించాలి” అని వెంకయ్యనాయుడు అన్నారు.

శాసనసభ్యులు ఒక పార్టీ నుండి మరొక పార్టీలోకి చేరడాన్ని.. పార్టీ ఫిరాయింపులను అరికట్టడానికి కొన్ని లొసుగులను పూడ్చాల్సిన అవసరం ఉందని వెంకయ్య నాయుడు సవరణలకు పిలుపునిచ్చారు. ఉపరాష్ట్రపతి ఎన్నికైన ప్రజాప్రతినిధులను కూడా రాజీనామా చేసి మరే ఇతర పార్టీలోకి ఫిరాయించకుండా తిరిగి ఎన్నిక కావాలని కోరారు. స్పీకర్‌లు, చైర్‌పర్సన్‌లు, కోర్టులు ఫిరాయింపుల నిరోధక కేసులను ఏళ్ల తరబడి పెండింగ్​లో పెట్టడంపై కూడా వెంకయ్యనాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement