Friday, April 26, 2024

శివ‌రాత్రికి – భోళా మెగా వైబ్స్

భోళా శంక‌ర్ మూవీ టైటిల్ ని ఖ‌రారు చేసిన చిత్ర మేక‌ర్స్ ..తాజాగా ఫ‌స్ట్ లుక్ ను రిలీజ్ చేసే ప‌నిలో ఉన్నారు. శివ‌రాత్రి సంద‌ర్భంగా భోళా శంక‌ర్ ఫ‌స్ట్ లుక్ ని రిలీజ్ చేయ‌నున్నారు. మార్చి 1న ఉదయం 9:05 గంటలకు ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నట్టు తెలిపారు. ‘ఈ మహాశివరాత్రికి మెగా ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి.. భోళా మెగా వైబ్స్ రాన్నాయి’ అంటూ ఈ చిత్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ వారు ట్విట్టర్ లో అఫిషియల్ అనౌన్స్ మెంట్ చేశారు. ఇప్పటికే టైటిల్ పోస్టర్ చాలా ఆసక్తిని కలిపించింది. మెగాస్టార్ చిరంజీవి ప‌లు భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు. ఆయ‌న న‌టిస్తోన్న చిత్రాల్లో భోళా శంక‌ర్ కూడా ఒక‌టి.

Advertisement

తాజా వార్తలు

Advertisement