Saturday, May 18, 2024

మూడో వ‌న్డే.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భార‌త్

IND VS SA : సఫారీలతో ఫైనల్‌ పోరులో ధావన్‌ సేన తలపడనుంది. ఇప్పటికే చెరో మ్యాచ్‌ గెలిచి.. రెండు జట్లు సిరీస్‌ పై కన్నేశాయి. ఇక ఈరోజు ఢిల్లీలో మూడో వన్డే జరుగనుంది. అయితే.. ఈ మ్యాచ్‌ లో టాస్‌ నెగ్గిన టీమిండియా మొదట ఫీల్డింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో సౌతాఫ్రికా మొదట బ్యాటింగ్‌ చేయనుంది. రెండు జట్లు సిరీస్ కైవసం చేసుకునేందుకు దూకుడు మీదున్నాయి.. అయితే ఏం జరుగుతుందో చూద్దాం మరి…

ఇరు జట్ల వివరాలిలా…
దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): క్వింటన్ డి కాక్ (w), జాన్నెమాన్ మలన్, రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ (సి), మార్కో జాన్సెన్, ఆండిలే ఫెహ్లుక్వాయో, జోర్న్ ఫోర్టుయిన్, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే

భారత్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్(సి), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్(w), వాషిం గ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అవేష్ ఖాన్

Advertisement

తాజా వార్తలు

Advertisement