రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఫేమస్ అయిన బాలాపూర్ లడ్డూ వేలం పాట ముగిసింది. ఈ ఉదయం 6 గంటల సమయంలో మొదలైన బాలాపూర్ వినాయకుడి ఊరేగింపు బాలాపూర్ సెంటర్‌లో నిలిచింది. బాలాపూర్ గణేష్ కార్యవర్గ సభ్యులు ఈ లడ్డూ వేలంపాటను చేపట్టారు. లడ్డూ వేలం పాట ముగిసింది. అయితే బాలాపూర్ లడ్డూ వేలంపాటలో రికార్డు ధర పలికింది. రూ.24.60లక్షలు పలికింది. వేలంలో లడ్డూను లక్ష్మారెడ్డి దక్కించుకున్నారు. గతేడాది రూ.18.90లక్షలు పలికిన బాలాపూర్ లడ్డూ.. గతేడాది కన్నా.. రూ.5.70లక్షలు అధికంగా పలికింది..
- Advertisement -