Sunday, October 13, 2024

కొత్త‌గా 6,093 క‌రోనా కేసులు-18మంది మృతి

నేడు కొత్త‌గా 6,093క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.కాగా క‌రోనాతో 18మంది మృతి చెందారు. మొత్తం క‌రోనా కేసులు 4,44,84,729కి చేరాయి. ఇందులో 4,39,06,972 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,121 మంది మృతిచెందారు. మరో 49,636 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా గత 24 గంటల్లో 9768 మంది కరోనా నుంచి బయటపడ్డార‌ని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక మొత్తం కేసుల్లో 0.11 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా, రికవరీ రేటు 98.70 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 214.55 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసిన‌ట్లు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement