Saturday, April 27, 2024

జెంట్స్ టాయిలెట్లోకి వెళ్లిన హీరోయిన్.. ఆ తర్వాతేమైందంటే..

ఇది నిజమా.. లేదా ఏదైనా సినిమాలో సీన్ లో భాగంగా జ‌రిగిందా? అన్న అనుమానం రావొచ్చు. కానీ, ఇది నిజం. ఈ రియల్ ఘటనను తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకునే ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ సందర్భంగా బయటపెట్టి షాకిచ్చింది.

దీపికా లాంటి స్టార్ బ్యూటీకి ఎందుకంత కష్టం వచ్చింది? ఎలాంటి పరిస్థితుల్లో దీపిక అలా చేసిందన్న విషయంలోకి వెళితే.. పలు ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి. దీపికా నటించిన తాజా చిత్రం గెహ్రాహియా.. ఇందులో చాలా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను దీపికా చేస్తోంది. అందాల ఆరబోతకు ఏ మాత్రం అభ్యంతరం చెప్పకపోగా.. హాట్ హాట్‌ సీన్లు చేసేందుకు కూడా వెనుకాడలేదు. దీంతో ఈ విషయం మ‌రింత హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీ ట్రైల‌ర్ చూశాక చాలామంది దీపికను తిట్టిపోస్తూ నెగిటివ్ గా రియాక్టు అయ్యారు. పెళ్లి తర్వాత కూడా ఇదేం ప‌ని అంటూ మండిపడిన వారు లేకపోలేదు. అయితే.. ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోని దీపికా వాట‌న్నిటిని అస్స‌లు ప‌ట్టించుకోలేదు.

ఆమె నటిస్తున్నతాజా మూవీ ప్రమోషన్లలో భాగంగా టీవీ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తోంది దీపికా. అ టైమ్‌లో సరదాగా అడిగిన ప్రశ్నకు దీపికా అనూహ్యమైన సమాధానం ఇచ్చి అందరిని విస్మయానికి గురి చేసింది. ఇంతకీ సదరు యాంకర్ అడిగిన ప్రశ్నను బదులిస్తూ.. ‘‘ఊహించని పరిస్థితుల్లో పురుషుల టాయిలెట్ కోసం వెళ్లాల్సి వచ్చింది. ఇదంతా బెర్లిన్ లో జ‌రిగింది. అక్కడ మ్యూజిక్ కోల్డ్ ప్లే కన్సర్ట్ కు నేనూ.. అలియాభట్ వెళ్లాం. షో అయ్యాక వాష్ రూమ్ కు వెళ్లాలనుకున్నా. కానీ.. ఉమెన్స్ వాష్ రూమ్ వద్ద పెద్ద క్యూ ఉంది. చేసేది లేక.. మెన్స్ వాష్‌ రూంలోకి వెళ్లాల్సి వచ్చింది’’ అంటూ తాను చేసిన పనిని చెప్పుకొచ్చింది. మెన్స్ టాయిలెట్ కు వెళ్లిన వైనాన్ని చెప్పిన దీపికా.. అలాంటి సందర్భాల్లో అది మెన్స్ వాష్ రూమా? వాష్ రూం క్లీన్ గా ఉందా? లేదా? లాంటివి అసలు విషయాలే కావని చెప్పుకొచ్చింది. ఏమైనా ఈ సీక్రెట్ ను దాచుకోకుండా ఉన్న‌దున్న‌ట్టు చెప్పిన తీరుకు దీపికాను అభినందిస్తున్నారు నెటిజ‌న్స్‌..

Advertisement

తాజా వార్తలు

Advertisement