Saturday, April 27, 2024

Big Breaking | ముగిసిన ఫస్ట్​ ఇన్నింగ్స్​.. 173 పరుగుల లీడ్​లో ఆసీస్​

డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్​ ఓవల్​ మైదానంలో జరుగుతోంది. మూడో రోజు ఆటలో భాగంగా టీమిండియా ఆల్​ అవుటయ్యింది. తొలుత ఫస్ట్​ ఇన్నింగ్స్​ ఆడిన ఆసిస్​ జట్టు 469 పరుగులు చేయగా.. టీమిండియా ఫస్ట్​ ఇన్నింగ్స్​లో 296 పరుగులకు ఆల్​ అవుటయ్యింది. దీంతో ఆసిస్​ జట్టు 173 పరుగుల లీడ్​లో ఉంది. కాగా, అజింక్యా రహానే, శార్దూల్ ఠాకూర్ జోడీ అద్భుత పోరాటంతో టీమిండియా కాస్త కోలుకుందని చెప్పవచ్చు. ఆసీస్ బౌలర్ల ధాటికి టాపార్డర్ చేతులెత్తేయగా… రహానే, శార్దూల్ ఠాకూర్ ఏడో వికెట్ కు అజేయంగా 108 పరుగులు జోడించారు.



మూడో రోజు ఆటలో లంచ్ విరామానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లకు 260 పరుగులు చేసింది. నిలకడగా ఆడుతున్న రహానే సెంచరీకి చేరువయ్యాడు. రహానే 122 బంతుల్లో 89 పరుగులు చేశాడు. అతడి స్కోరులో 11 ఫోర్లు, 1 సిక్సు ఉన్నాయి. ఈ క్రమంలో రహానే టెస్టుల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన భారత క్రికెటర్లలో రహానే 13వ వాడు. మరో ఎండ్ లో శార్దూల్ ఠాకూర్ ఎంతో సహనంతో బ్యాటింగ్ చేస్తున్నాడు.

లండన్ లోని ఓవల్ మైదానంలో జరుగుతున్న ఈ టెస్టు సమరంలో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో 469 పరుగులకు ఆలౌట్ అయింది. మరికాసేపట్లో ఆసిస్​ సెకండ్​ ఇన్నింగ్స్​ని స్టార్​  చేయనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement