Tuesday, May 14, 2024

Breaking: కొల్లువంక వాగులో గల్లంతైన కారు.. కారులో వ్యక్తి సేఫ్​

ఏపీలోని కర్నూలు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఆలూరు దగ్గరున్న కొల్లువంక వాగులో ఓ కారు కొట్టుకుపోయింది. కాగా, దీనికోసం ఎన్డీఆర్​ఎఫ్​ సిబ్బంది రెస్య్కూ చేపట్టారు. ఆ కారును గుర్తించారు పోలీసులు. దాదాపు 12 గంటల తర్వాత ఆ కారు ఆనవాళ్లు లభించాయి. అయితే.. కారులో ఉన్న వ్యక్తి మాత్రం సేఫ్​గా ఉన్నాడు. అతను కర్నాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. దీంతో అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

బెంగళూరు నుండి గుల్బర్గా కు PHD చెసేందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. కాలేజీలో జాయిన్ అవ్వడానికి సింగల్ గా కారులో బయలుదేరుగా ఈ ఘటన జరిగింది.. అదృష్టశాతవు గా కారులో కిందికి దిగి ఈత కొడుతూ ఒడ్డుకు చేరుకొని రాత్రింతా బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు కాపాడుకున్నాడు. బాధితుడిని జాయిద్ అన్సారిగా గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement