Thursday, May 16, 2024

TS: వరల్డ్​లోనే ది బెస్ట్​ స్టార్టప్​ ఇంక్యుబెటర్​.. టీహబ్​‌‌–2 ప్రారంభ ఏర్పాట్లను పరిశీలించిన కేటీఆర్​

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీ హబ్-2 ప్రారంభానికి రెడీగా ఉంది. ఐటీ కారిడార్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యంత విశాలమైన ఐదు రోడ్ల కూడలిలో టీ-హబ్ రూపు దిద్దుకుంది. మూడెకరాల్లో 276 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించారు. ఐటీ హబ్-2ను తెలంగాణ సీఎం కేసీఆర్ 28వ తేదీ మంగళవారం ప్రారంభించనున్నారు. ఈ ప్రతిష్టాత్మకమైన స్టార్టప్ ఇంక్యూ బెటర్ టీ హబ్-2 దేశంలోనే అతిపెద్దది. కాగా, సోమవారం రాత్రి మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు.

రాయదుర్గం నాలెడ్జ్‌సిటీలో సుమారు 5.82 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రంగా టీ హబ్​2ని తీర్చిదిద్దారు. టీ హబ్‌-2లో ఒకేసారి 2 వేలకుపైగా స్టార్టప్‌లు తమ కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు వీలుగా అన్నిరకాల మౌలిక వసతులు కల్పించామంటున్నారు తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్టార్టప్ లకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా టీ-హబ్, వీ-హబ్ , డేటా సెంటర్, టీ-వర్క్స్ వంటి వినూత్న ఇంక్యుబేటర్లను ఏర్పరిచింది.

ఇన్నోవేషన్ ఎకో సిస్టంను బలోపేతం చేసేందుకు ఈ కార్యక్రమాలు తోడ్పడటంతో పాటు దేశవ్యాప్తంగా పలువురి మన్ననలు పొందాయి. 2015లో స్టార్టప్‌లను ప్రభుత్వ పరంగా ప్రోత్సహించేందుకు ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఐటీ హబ్ ప్రస్థానం ప్రారంభమైంది. కాగా, టీ-హబ్‌ నుంచి 5 మార్గాల్లో వెళ్లేందుకు 100 అడుగుల నుంచి 120 అడుగుల రహదారులను నిర్మించారు. వీటిలో మొదటిది దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి మీదుగా వచ్చే రోడ్డు, రెండోది మైండ్‌ స్పేస్‌ జంక్షన్‌ నుంచి వచ్చే రోడ్డు, మూడోది రహేజ మైండ్‌ స్పేస్‌ నుంచి రాయదుర్గం బయోడైవర్సిటీ చౌరస్తాను కలిసి రోడ్డు. నాలుగోది రాయదుర్గం- మాదాపూర్‌ వెళ్లే రోడ్డు, పాత ముంబై హైవేను కలిపే రోడ్డు. ఇలా మొత్తం 5 విశాలమైన రోడ్లతో కూడలి ఉండటం దీని ప్రత్యేకత. హైదరాబాద్​ సిటీ నలుమూలల నుంచి ఏ మార్గంలో వచ్చినా టీ హబ్‌కు ఈజీగా చేరుకునేలా రోడ్డు మార్గాలున్నాయి. మొత్తం పది అంతస్తుల్లో నిర్మించిన ఈ టి హబ్ లో ప్రస్తుతం ఐదు అంతస్తులను అందుబాటులోకి తీసుకువచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement