Friday, May 17, 2024

ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ థియేట‌ర్ లో ఆర్ ఆర్ ఆర్ స్పెష‌ల్ షో-ట్వీట్ చేసిన రాజ‌మౌళి

ఆర్ ఆర్ ఆర్ చిత్రం మ‌రోసారి తెలుగు సినీ ప‌రిశ్ర‌మ ఖ్యాతిని ప్ర‌పంచానికి తెలియ‌జేసింది. కాగా ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన స్టార్ హీరోలు రామ్ చ‌ర‌ణ్..ఎన్టీఆర్ లు పాన్ ఇండియా హీరోలుగా మారిపోయారు. కాగా ఈ చిత్రాన్ని రాజ‌మౌళి తెర‌కెక్కించారు. ఈ చిత్రం ప్ర‌పంచంలోనే అతిపెద్ద ఐమాక్స్ థియేట‌ర్ చైనీస్ థియేట‌ర్ (TLC Chinese IMAX Theater)లో స్క్రీనింగ్ అయింది. ఆర్ఆర్ఆర్ ఒరిజిన‌ల్ వెర్ష‌న్ ను ఇంగ్లీష్ స‌బ్ టైటిల్స్‌తో స్పెష‌ల్ షో వేశారు. ఈ షోకు జ‌క్క‌న్న హాజ‌ర‌వ‌గా..సూప‌ర్ హిట్ట‌యింది. త‌న సంతోషాన్ని ట్విట‌ర్ ద్వారా షేర్ చేసుకున్నారు జ‌క్క‌న్న. థియేట‌ర్ల‌లో హోరెత్తిస్తున్న సినీ జ‌నాల మ‌ధ్యలోకి వెళ్లి థ్రిల్ ను ఎంజాయ్ చేసిన వీడియోను ట్విట‌ర్ లో పోస్ట్ చేస్తూ.. నా సినిమా, హీరోలపై మీరు చూపించిన ఆద‌ర‌ణ‌, కురిపించిన ప్ర‌శంస‌లు న‌న్ను ఎంతో ఆక‌ర్షించాయి. యూఎస్ఏకు కృత‌జ్ఞ‌త‌లు..అంటూ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement