Thursday, April 25, 2024

థ్యాంక్యూ – రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ హీరో నాగ‌చైత‌న్య తాజా చిత్రం థ్యాంక్యూ . దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాకి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. జూలై 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా చెబుతూ, అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో చైతూ డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు. చైతూ సరసన నాయికలుగా రాశి ఖన్నా .. మాళవిక నాయర్ .. అవికా గోర్ అలరించనున్నారు. ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. త్వరలోనే అలా ఈ సినిమా నుంచి టీజర్లు .. ట్రైలర్లు .. లిరికల్ వీడియోల సందడి మొదలు కానుంది. ముగ్గురు హీరోలతో చైతూ రొమాన్స్ అనడంతో, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. చైతూ ఆ తరువాత ప్రాజెక్టును పరశురామ్ తో చేయనున్నాడ‌ట‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement