Thursday, April 25, 2024

క‌శ్మీర్ అందాల‌ని ఆస్వాదిస్తోన్న – హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌

లైగ‌ర్ చిత్రం త‌రువాత హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ తో మ‌రో సినిమా చేయ‌బోతున్నాడు. పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగనమణ ను రౌడీ హీరో తోనే చేయబోతున్నాడు పూరీ. ఇక ఈ సినిమాకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఈలోపు విజయ్ గతంలో కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలోనే శివ నిర్వాణతో సినిమా స్టార్ట్ చేశాడు. ఈమూవీలో సమంత ..విజయ్ కి జంటగా నటిస్తోంది.. మహానటి తరువాత విజయ్ దేవరకొండతో సమంత నటిస్తున్న సెకండ్ ఫిల్మ్ ఇది. ఇక మజిలీ తరువాత శివ నిర్వాణ డైరెక్షన్ లో సమంత నటిస్తున్న సెకండ్ ఫిల్మ్ కూడా ఇదే కావడం విశేషం.
ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్ లో జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా తెగ సందడి చేస్తున్నారు టీమ్. అక్కడి విశేషాలు స్టార్స్ సోషల్ మీడియలో పంచుకుంటున్నారు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ ఓ వీడియోను షేర్ చేశాడు. షూటింగ్ గ్యాప్ లో కాశ్మీర్ అందాలను ఆస్వాదిస్తున్న యంగ్ హీరో.. హ్యాపీగా బోడ్ రైడ్ చేస్తూ.. చిల్ అవుతున్నాడు. దీనికి సంబంధించి వీడియదో ను తన సోషల్ మీడియా పేజ్ లో అప్ లోడ్ చేశాడు విజయ్. ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. ఇక రౌడీ హీరో లేడీ ప్యాన్స్ అయితే ఈ వీడియోలో విజయ్ డబుల్ హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడంటున్నారు. ఈ సినిమాలో విజయ్ లుక్ ఇదే అయ్యి ఉంటుంది అనుకుంటున్నారు. సినిమా కోసం వెయిట్ చేస్తున్నామంటున్నారు ఫ్యాన్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement